»Telugu States Box Office February Did Not Remain A Disaster All Hopes Are On March
Telugu States Box Office: డిజాస్టర్‌గా మిగిలిని ఫిబ్రవరి.. ఆశలన్నీ మార్చి పైనే..!
ఈ ఏడాది సంక్రాంతి రిలీజ్‌లతో టాలీవుడ్లో స్టార్ట్ అయ్యింది. హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్ లు పోటీ పడగా, హనుమాన్ సంచలనాత్మక బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కానీ ఫిబ్రవరి నెలలో మాత్రం ఎలాంటి బ్లాక్బస్టర్లు లేవు.
Telugu States Box Office: ఈ ఏడాది సంక్రాంతి రిలీజ్‌లతో టాలీవుడ్లో స్టార్ట్ అయ్యింది. హనుమాన్, గుంటూరు కారం, నా సామి రంగ , సైంధవ్ లు పోటీ పడగా, హనుమాన్ సంచలనాత్మక బ్లాక్‌బస్టర్‌గా నిలిచాడు, గుంటూరు కారం ఆంధ్ర ప్రదేశ్ కొనుగోలుదారులకు బాగానే వర్కౌట్ అయ్యింది. నా సామి రంగా బయ్యర్లకు బ్రేక్ ఈవెన్ సాధించింది. సైంధవ్ ఫ్లాప్ అయ్యింది. అయినా.. సంక్రాంతి పర్వాలేదనిపించింది. జనవరి పర్వాలేదనిపించినా ఫిబ్రవరి మాత్రం టాలీవుడ్ ని పూర్తిగా నిరాశపరిచింది. మామూలుగానే ఫిబ్రవరి నెలలో చాలా చిన్న , మధ్యతరహా బడ్జెట్ చిత్రాలు విడుదలవుతాయి, కానీ ఏ సినిమా కూడా 1వ వారాంతం తర్వాత మంచి కలెక్షన్లను సాధించలేకపోయింది. చాలా సినిమాలు ఓపెనింగ్ రోజు నుండే క్రాష్ అయ్యాయి.
ఫిబ్రవరి విడుదలలో భారీ బడ్జెట్ చిత్రం ఈగల్ ఉంది. దీనిపై చాలా అంచనాలు పెట్టుకున్నారు కానీ.. ప్లాప్ గా నిలిచింది. మీడియం బడ్జెట్ చిత్రాలైన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, యాత్ర 2, ఊరు పేరు భైరవకోన మాత్రమే. మీడియం బడ్జెట్ చిత్రాలలో జనవరి విడుదలలతో పోల్చితే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ , ఊరు పేరు భైరవకోన మాత్రమే మంచి కలెక్షన్లను సాధించింది. ఫిబ్రవరిలో సిద్ధార్థ్ రాయ్, మస్తు షేడ్స్ ఉన్నై రా, సుందరం మాస్టర్, ధీర, కిస్మత్ , బూట్‌కట్ బాలరాజు వంటి చిన్న బడ్జెట్ చిత్రాల విడుదలలు ఉన్నాయి కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంలో విఫలమయ్యాయి.
ఊరు పేరు భైరవకోన మాత్రమే ఇతర సినిమాలతో పోల్చితే యావరేజ్ – ఎబౌ యావరేజ్ స్టేటస్‌తో స్థిరపడింది. మిగిలిన విడుదలలన్నీ బాక్సాఫీస్ వద్ద పెద్ద పరాజయం పాలయ్యాయి. ఇప్పుడు మార్చి రిలీజ్లు కాస్త రిలీఫ్ ఇస్తాయని థియేటర్ యజమానులు భావిస్తున్నారు. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, వెన్నెల కిషోర్ నటించిన చారి 111 ఈరోజు విడుదల కానున్నాయి. ఆపరేషన్ వాలెంటైన్‌కి మంచి బుకింగ్‌లు రావచ్చు కానీ కలెక్షన్లకు పబ్లిక్ టాక్ ముఖ్యం. అలాగే, వయోహం మార్చి 2న విడుదలవుతోంది, దీనికి పెద్దగా సందడి లేదు. భీమా, గామి, ప్రేమలు తెలుగు డబ్ మార్చి 8న విడుదలై మంచి బజ్‌ని కలిగి ఉన్నాయి. మంచి కలెక్షన్లను కూడా రాబట్టవచ్చు. శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ మార్చి 22న, టిల్లు స్క్వేర్ మార్చి 29న విడుదలవుతోంది. మరి మార్చి నెల అయినా.. ఆశజనకంగా ఉంటుందో లేదో చూడాలి.