Tamil Actress Andrea Reacts About Her Glamour Roles
Andrea: ఆండ్రియా (Andrea).. తమిళ నటి.. ఇండస్ట్రీలోకి గాయనీగా ఎంట్రీ ఇచ్చి మీరోయిన్ అయ్యింది. అంతకుముందు పియానో ఆర్టిస్ట్‌గా కూడా పనిచేసింది. కెరీర్ తొలినాళ్లలో ఆచి తూచి పాత్రలను ఎంపిక చేసుకుంది. తర్వాత అవకాశాల కోసం గ్లామర్ రోల్స్‌కు సై అంది. ఆమె కొత్త మూవీలో అర్ధనగ్నంగా నటించిందని తెలిసింది. ఇదే విషయంపై ప్రశ్నిస్తే.. అవును నటిస్తే తప్పేంటి అని ఎదురు ప్రశ్నిస్తోంది.
ప్రస్తుతం ఆండ్రియా (Andrea) చేతిలో ఆరుకి పైగా సినిమాలు ఉన్నాయి. అవకాశం ఉన్న చోట్ల ఎక్స్పోజ్ చేసేందుకు ఓకే అంటోంది. అనల్ మేల్ పణితులి అనే సినిమాలో ఆండ్రియా కీ రోల్ పోషిస్తోంది. అందులో అర్ధనగ్నంగా కనిపిస్తోందని.. యూనిట్ సభ్యులు లీక్ చేశారు. దీంతో ఇదే విషయమై తెగ ప్రచారం జరుగుతోంది. అవును అర్ధనగ్నంగా నటిస్తే తప్పేంటి.. నిజ జీవితంలో అలాంటి ఘటనలు చాలానే జరిగాయని అంటోంది. వాటితో పోలిస్తే ఇదీ తక్కువే అన్నట్టుగా పేర్కొంది.
ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం.. అవకాశాల కోసం ఇప్పుటు హీరోయిన్స్ ఎలాంటి పాత్రలనైనా చేస్తున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదని.. పరిస్థితి రోజు రోజుకు మారుతోందని క్రిటిక్స్ అంటున్నారు. సో.. కొందరు అలా పరిధి దాటి మరీ యాక్ట్ చేస్తున్నారని చెబుతున్నారు. ఆ జాబితాలో ఆండ్రియా (Andrea) చేరారు.