Nayanthara will be playing the lead heroine’s sister role
Nayanthara: లేడి సూపర్ స్టార్ నయనతార (Nayanthara) గురించి స్పెషల్‌గా చెపాల్సిన అవసరం లేదు. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి.. ఓ వైపు హీరోల సినిమాల్లో మెయిన్ లీడ్ రోల్స్ చేస్తూనే, మరోవైపు లేడీ ఓరియంటెడ్ రోల్స్ కూడా చేస్తోంది. రీసెంట్గా జవాన్ మూవీతో బాలీవుడ్లో కూడా అడుగుపెట్టింది. సడెన్‌గా నయనతార సిస్టర్ రోల్ చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
లవ్ టుడే నటుడు-దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ అక్క పాత్రను పోషించబోతున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. నయనతార కథానాయికకు సోదరి పాత్రలో నటిస్తుందని తెలియడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. భర్తే దర్శకుడు కాబట్టి, ఈ సినిమాని అంగీకరించిందని తెలుస్తోంది.
ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్ తాజాగా కొత్త సినిమాను కన్ఫర్మ్ చేస్తూ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు జాన్వీ పేరు వినపడుతోంది. వేరే వాళ్లను తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. నయనతార అగ్ర నటి కావడంతో ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భర్త కోసం హీరోయిన్ సోదరి పాత్ర చేయడానికి అంగీకరించింది. ఆ పాత్రకు అధిక ప్రాధాన్యత ఉండటం వల్లే అంగీకరించినట్లు సమాచారం. తమిళ చిత్రంలో నయనతార హీరోయిన్ సోదరి పాత్రను పోషిస్తుందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. దీనిపై ప్రకటన రావాల్సి ఉంది.