»Star Heroine Affair With A Married Man Cant Bear The Torture
Andrea Jeremiah: పెళ్లైన వ్యక్తితో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. టార్చర్ భరించలేక..?
సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎఫైర్లు కామన్ అనే టాక్ ఉంది. ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం జరుగుతునే ఉంటాయి. అయితే.. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ కాస్త షాకింగ్‌గా ఉన్నాయి.
Star heroine affair with a married man.. Can't bear the torture..?
Andrea Jeremiah: సినిమాలోనే కాదు.. రియల్ లైఫ్‌లోను హీరోయిన్లు ఎవరితో ప్రేమలో పడతారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారో? అస్సలు అర్థం కాని విషయం. సినిమా లైఫ్లాగే వాళ్ల నిజ జీవితంలోను జరుగుతుంటాయి. హీరో, హీరోయిన్లు ప్రేమలో పడడం చూస్తూనే ఉన్నాం. కానీ కొందరే సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొందరు కొన్నాళ్లకే విడిపోతున్నారు. అయితే.. ఇండస్ట్రీలో వీటికంటే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఎఫైర్స్. ఈ మాట వినగానే ఆడియెన్స్ చెవులు కొరుక్కుంటారు. లేటెస్ట్గా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆండ్రియా తన ఎఫైర్ గురించి చెబుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. సింగర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆండ్రియా జెర్మియా.. ఆ తరువాత హీరోయిన్గా చాలా సినిమాలు చేసింది.
అయితే.. ఈ అమ్మడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో ఎఫైర్ విషయంలో అప్పట్లో హాట్ టాపిక్ అయింది. వీరిద్దరు చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు గంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయంలో ఎప్పుడు స్పందించలేదు కానీ.. తాను ఓ పెళ్లైన వాడితో ఎఫైర్ పెట్టుకున్నానని బాహాటంగానే చెప్పుకొచ్చింది ఆండ్రియా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో ఓ పెళ్లైన వ్యక్తితో తాను ఎఫైర్ పెట్టుకున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. అతను తనను శారీరకంగా చాలా హింసించాడని తెలిపింది. అతని టార్చర్ భరించలేక డిప్రెషన్లోకి వెళ్లిపోయానని వెల్లడించింది. అయితే.. ప్రస్తుతానికి అతనికి దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చింది ఆండ్రియా. దీంతో ఎవరా వ్యక్తి అని ఆరా తీసే పనిలో ఉన్నాయి కోలీవుడ్ వర్గాలు.