»Ssmb Mahesh Babu Rajamoulis Movie Shooting This Is The Clarity
SSMB: మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్.. ఇదే క్లారిటీ!
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి నుంచి రాబోయే సినిమా కోసం యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ తాజాగా నిర్మాత ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు.
SSMB: Mahesh Babu, Rajamouli's movie shooting.. This is the clarity!
SSMB: మహేష్ బాబుతో నా నెక్స్ట్ సినిమా చేస్తున్నానని చెబుతునే ఉన్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. రీసెంట్గా జపాన్‌లో ఆర్ఆర్ఆర్ స్పెషల్ స్క్రీనింగ్‌కు వెళ్లగా.. అక్కడ కూడా మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నానని చెప్పాడు. అంతేకాదు.. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మహేష్ బాబుని జపాన్‌కి తీసుకొస్తానని చెప్పాడు. అయితే.. ఇప్పటివరకు ఇలా చెప్పడం తప్పితే.. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు రాజమౌళి. మహేష్ బాబు కూడా ఏదైనా ఉంటే, రాజమౌళినే అడగాలని చెబుతున్నాడు.
మరి ఎస్ఎస్ఎంబీ 29 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? అంటే, ఇప్పుడో సాలిడ్ క్లారిటీ మాత్రం వచ్చేసింది. ఈ సినిమా నిర్మాత కే.ఎల్. నారాయణ రీసెంట్ ఇంటర్వ్వూలో.. ఈ సినిమా గురించి కొన్ని విషయాలు రివీల్ చేశారు. ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిపారు. ప్రస్తుతం మహేష్ తన పాత్రకి సంబందించిన మేకోవర్ కోసం రెడీ అవుతున్నట్టుగా చెప్పారు. అలాగే.. ఆఫ్రికా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో సినిమా ఉంటుందని కన్ఫామ్ చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఆగష్టు 9న సూపర్ స్టార్ బర్త్ డే ఉంది. ఆ రోజు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే.. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా అధికారిక ప్రకటన రానుందనే ప్రచారం కూడా ఉంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఆగష్టులో మాత్రం ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్ స్టార్ట్ అవడం మాత్రం గ్యారెంటి.