ఈ మధ్య ఏదో ఓ కారణంగా సినిమాలను పోస్ట్ పోన్ చేస్తునే ఉన్నారు మేకర్స్. ముఖ్యంగా బడా హీరోల సినిమాలకు రిలీజ్ కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్‌గానే ప్రభాస్ ‘ఆదిపురుష్’ పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మహేష్ బాబు అప్ కమింగ్ ఫిల్మ్ కూడా వాయిదా పడనుందని తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మహేష్ బాబు.
అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే.. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవడం కష్టమేనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ మధ్యే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. తిరిగి సెట్స్ పైకి వెళ్లడం లేదు. రీసెంట్గా మహేష్ లండన్ ట్రిప్ నుంచి తిరిగి రావడంతో..
త్వరలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. కానీ డేట్ మాత్రం చెప్పలేకపోతున్నారు. పైగా హీరోయిన్ పూజా హెగ్డే కాలికి గాయం కావడంతో రెస్ట్ మోడ్‌లో ఉంది. దాంతో ఈ నెలలో అనుకున్న షెడ్యూల్.. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ఉండొచ్చని టాక్. ఇలా ఏదో ఓ కారణంగా ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ డిలే అవుతుండడంతో..
అనౌన్స్ చేసిన డేట్‌కి ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇదే జరిగితే రాజమౌళి-మహేష్ సినిమా కూడా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి ఎస్ఎస్ఎంబీ 28 అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందో లేదో.. వెయిట్ అండ్ సీ.