శ్రీవిష్ణు(Srivishnu) హీరోగా ‘సామజ వర గమన’ మూవీ(Samajavaragamana Movie) తెరకెక్కుతోంది. మే 18వ తేదిన ఈ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. రామ్ అబ్బరాజు(Ram Abbaraju) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు తెరకు రెబా మోనిక జాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.
‘సామజ వర గమన’ టీజర్ :
తాజాగా సామజ వర గమన మూవీ (Samajavaragamana Movie) నుంచి టీజర్ (Teaser)ను చిత్ర యూనిట్ రిలీజ్(Release) చేసింది. తమ వెంటపడి వేధించే అబ్బాయిలకు అమ్మాయిలు రాఖీలు కడుతుంటారు. ఈ సినిమాలో హీరో రాఖీలను తన జేబులో పెట్టుకుని తిరుగుతూ అమ్మాయిల వెంటపడుతూ ఉంటాడు. వారితో రాఖీలు కట్టించుకుని సంతోషపడుతుంటాడు. అందుకు ఓ కారణం ఉంది. ఆ కారణం ఏంటనేదే ఈ మూవీ కథాంశం.
టీజర్ లో శ్రీవిష్ణు(Srivishnu) పాత్ర చాలా ఎంజాయ్ ఫుల్ గా ఉంటుంది. ఈ మూవీలో కామెడీ పుష్కలంగా ఉందని టీజర్(Teaser) చూస్తేనే తెలుస్తోంది. ఈ సినిమాలో లోకల్ మాస్ పార్టీ లీడర్ లుక్ తో వెన్నెల కిశోర్ నటిస్తున్నాడు. వెన్నెల కిశోర్ పాత్రం అందర్నీ కడుపుబ్బా నవ్వించనుంది. ఈ సినిమాకు గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.