ఒక్క సలార్ రిలీజ్ డేట్.. చాలా సినిమాల రిలీజ్ డేట్స్‌లో మార్పులు చేసేసింది. ఎప్పుడైతే సలార్ పోస్ట్‌పోన్ అని తెలిసిందో.. చాలా సినిమాలు సెప్టెంబర్ 28న వచ్చేందుకు రెడీ అయిపోయారు. తాజాగా రామ్ 'స్కంద' కూడా సలార్ ప్లేస్‌లోకి వచ్చేసింది.
సెప్టెంబర్ 28న సలార్ వస్తున్నాడని.. రెండు వారాలు బాక్సాఫీస్‌ను ప్రభాస్‌కు రాసిచ్చేశారు మిగతా హీరోలంతా. కానీ ఎప్పుడైతే సలార్ వాయిదా అని తెలిసిందో.. అందరి కన్ను సలార్ రిలీజ్ డేట్ పైనే పడింది. ఎందుకంటే.. సెప్టెంబర్ 28న సినిమా రిలీజ్ అయితే.. వరుస హాలిడేస్ కలిసి రానున్నాయి. అందుకే సలార్ ప్లేస్‌లోకి వచ్చేందుకు మిగతా హీరోలు సై అంటున్నారు. ఇప్పటికే మ్యాడ్, పెదకాపు, రూల్స్ రంజన్ లాంటి సినిమాలు సలార్ వీక్‌లో వచ్చేకుందు డేట్ అనౌన్స్ చేశాయి. ఇక ఇప్పుడు రామ్ కూడా సలర్ ప్లేస్‌లోకి వచ్చేశాడు.
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ మూవీకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ సలార్ పోస్ట్‌పోన్ అవడంతో.. స్కందను రెండు వారాలు పోస్ట్‌పోన్ చేశారు. తాజాగా సెప్టెంబర్ 28న స్కంద రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో స్కందకు ఇది ఖచ్చితంగా కలిసొచ్చే డేట్ అనే చెప్పాలి.
28న వస్తున్న పెద్ద సినిమా ఇదే. పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి.. స్కందకు తిరుగు లేదనే చెప్పాలి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన స్కంద సాంగ్స్, ట్రైలర్ మాసివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. బోయపాటి మార్క్ యాక్షన్, రామ్ ఎనర్జటిక్ పర్ఫార్మెన్స్ పీక్స్ అనేలా ట్రైలర్ ఉంది. ఇక యంగ్ బ్యూటీ శ్రీలీల, రామ్ డ్యాన్స్ అదుర్స్ అనేలా ఉంటుందని సాంగ్స్ చెబుతున్నాయి. ఖచ్చితంగా స్కంద అదిరిపోతుందని అంటున్నారు. మరి సలార్ డేట్‌ను కబ్జా చేసిన రామ్, బోయపాటి ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.