ఎంతమంది స్టార్స్ వచ్చినా ఇంయడియన్ సూపర్ స్టార్ ఒక్కడే. అతనే రజనీ కాంత్. అయితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా రజనీ కాంత్ సింప్లిసిటీకి సలామ్ కొట్టాల్సిందే. ఎంతలా అంటే.. ఏకంగా ఆయనను బిచ్చగాడు అనుకునేంత సింపుల్‌గా ఉంటాడు.
గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. రీసెంట్గా వచ్చిన జైలర్ సినిమాతో బాక్సాఫీస్ బూజు దులిపేశాడు. ఏకంగా 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. సెన్సేషన్ క్రియేట్ చేశాడు తలైవా. ఈ సినిమాకు ఏకంగా 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకొని.. మరో వంద కోట్ల చెక్ అందుకొని.. మొత్తంగా 200 కోట్లకు పైగా పారితోషికం అందుకొని రికార్డ్ క్రియేట్ చేశాడు. అలాగే కాస్ట్లీ కార్ గిఫ్ట్‌ను కూడా ఇచ్చారు మేకర్స్. ఇలాంటి స్టార్ హీరోని బిచ్చగాడు అనుకొని 10 రూపాయలు దానం చేసిందట ఒక మహిళ. ఈ విషయాన్ని స్వయంగా రజనీకాంత్‌నే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
అప్పుడప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. తాజాగా మరోసారి ఈ న్యూస్ వైరల్‌గా మారింది. 2007లో శివాజీ చిత్రం రిలీజైన తర్వాత గుడికి వెళ్లాడట రజనీకంత్. కాకపోతే మారు వేషంలో వెళ్లారట. దీంతో రజనీ ఓల్డ్ లుక్‌లో ఎవరు గుర్తు పట్టలేకపోయారట. అంతేకాదు.. ఆయన లుక్ చూసి బిచ్చగాడు అనుకొని ఒక మహిళ పది రూపాయలు దానం కూడా ఇచ్చిందట. అయినా కూడా రజనీ కాంత్ ఆమెను ఏమి అనకుండా పది రూపాయలను దేవుని హుండీలో వేశారట.
అయితే ఆ తర్వాత రజనీ కారు ఎక్కడాన్ని గమనించిన సదరు మహిళ.. వెంటనే రజనీ దగ్గరకు వెళ్లి క్షమాపణలు కోరిందట. 10 రూపాయలు వెనక్కి ఇవ్వాలని కోరిందట. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘ప్రతిసారి దేవుడు తన ముందు నేనొక బిచ్చగాడినే’ అని అంటుంటాడు తలైవా. ఇదే కాదు రోడ్డు పై వెళ్తు లుంగీలో టిఫిన్ చేయడం కూడా రజనీ స్టైల్. అసలు బయట సూపర్ స్టార్‌ను సింపుల్‌గా చూస్తే గుర్తు పట్టడం కష్టమే.