Unni Mukundan: లైంగిక వేధింపుల కేసు… హీరోకి బిగ్ రిలీఫ్
మళయాళ నటుడు ఉన్ని ముకుందన్ కి బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనపై లైంగిక వేధింపుల కేసును కేరళ హైకోర్టు కొట్టివేసింది. రెండు పార్టీలు పరస్పరం సెటిల్మెంట్కు చేరుకున్నాయి.
ఉన్ని ముకుందన్ కేసులో విచారణను కొనసాగించడానికి సరైన ఆధారాలు లేవని న్యాయమూర్తి జస్టిస్ పి గోపీనాథ్ కేసును కొట్టివేశారు. ఫిబ్రవరి 2023లో ముకుందన్ న్యాయవాది లంచం ఇస్తున్నారనే ఆరోపణల మధ్య బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. మేలో న్యాయస్థానం విచారణ ప్రక్రియపై స్టేను ఎత్తివేసింది. 2017లో జరిగిన ఓ సమావేశంలో ముకుందన్ తనపై లైంగిక దాడి చేశాడని, ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఆరోపణలను ముకుందన్ ఖండించారు. ఆమెపై పరువు నష్టం కేసును దాఖలు చేశారు. సెటిల్మెంట్లో ఆమె రూ.25 లక్షలు కావాలని ఆరోపించింది. దిగువ కోర్టులలో కేసును రద్దు చేయడానికి ప్రయత్నించిన ఫలితం లేదు. దీంతో ఉన్ని ముకుందన్ హైకోర్టులో అప్పీల్ చేశాడు. 2022 చిత్రం మాలికప్పురంలో తన పాత్రకు పేరుగాంచిన ఉన్ని ముకుందన్, ఇప్పుడు వెట్రిమారన్ రచయితగా సూరి, శశికుమార్ కలిసి ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు.