పోయిన ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రానా. వాటిలో భీమ్లా నాయక్(Bhimla Naik), విరాట పర్వం సినిమాలతో అలరించగా.. 1945 అనే సినిమా ఎప్పుడొచ్చిందో కూడా తెలియకుండా పోయింది. అయితే విరాట పర్వం సినిమా తర్వాత రూట్ మారుస్తానని.. కమర్షియల్ చేస్తానని చెప్పుకొచ్చాడు రానా. చెప్పినట్టుగానే ఇటీవల హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కాకపోతే గుణశేఖర్(Gunasekhar)కు తెలియకుండానే ఈ సినిమా అనౌన్స్మెంట్ చేశాడు. దీంతో గుణ శేఖర్, రానా పై ఫైర్ అయ్యాడు.
ఇంకా ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనే విషయంలో క్లారిటీ రాలేదు. దీంతో ఇంకొన్ని సినిమాలు లైన్లో పెట్టాడు రానా. ఇక ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)సినిమాలో నటించే ఛాన్స్ అందుకున్నాడు. రీసెంట్గా జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రజనీకాంత్.. తన నెక్స్ట్ సినిమాని జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. తలైవర్ 170 అనే వర్కింగ్ టైటిల్‌తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తాజాగా లైకా ప్రొడక్షన్ వారు.. రానా దగ్గుబాటి (Rana Daggubati) ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ రివీల్ చేశారు.
అయితే గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్‌లో శర్వానంద్ (Sharwanand)నటిస్తున్నాడు అనే వార్త వినిపిస్తునే ఉంది. కానీ ఇప్పుడు రానా ఫైనల్ అని చెప్పడంతో.. శర్వానంద్‌కు షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే రజనీతో కలిసి నటించడం అంటే మామూలు విషయం కాదు. పైగా అమితాబ్-రజినీకాంత్ లకి విలన్ క్యారెక్టర్ అనే టాక్ ఉంది. కాబట్టి.. ఈ ఇద్దరు లెజెండరీ యాక్టర్స్‌కు రానా విలన్‌గా నటిస్తున్నాడనే చెప్పాలి. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవనుంది. ఏదేమైనా శర్వానంద్‌కు రజనీ(Rajni)తో నటించే ఛాన్స్ వచ్చిందా? లేదంటే రిజెక్ట్ చేశాడా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కానీ రానా మాత్రం బంపర్ ఆఫర్ కొట్టేశాడనే చెప్పాలి.