Shahrukh Khan: బట్టతల అమ్మాయిల పై షారుఖ్ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'జవాన్' సెప్టెంబర్ 7న రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇందులో షారుఖ్ గుండుతో కనిపించాడు. దీంతో తనకు కూడా అలాంటి అమ్మాయిలంటే ఇష్టం అంటున్నాడు షారుఖ్.
కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన జవాన్.. విడుదలైన వారం రోజుల్లోనే 700 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాదితో పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టిన షారుఖ్.. జవాన్ సినిమాతో మరో వెయ్యి కోట్లు రాబట్టడం గ్యారెంటీ అంటున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించగా.. నయనతార హీరోయిన్గా నటించింది. అయితే ఈ చిత్రంలో షారుఖ్ చూపించిన వేరియేషన్స్ అంత ఇంతా కాదు.
ముఖ్యంగా గుండుతో కనిపించి షాక్ ఇచ్చాడు కింగ్ ఖాన్. దీంతో షారుఖ్‌ను చూసి ఫిదా అవుతున్నారు అభిమానులు. మొదట్లో షారుఖ్ గుండుతో కనిపించగానే.. అరె ఏంటిది? ఇలా కనిపిస్తున్నాడని అనుకున్నారు. కానీ తాజాగా ఈ లుక్‌పై షారుఖ్ స్పందించాడు. ‘జవాన్’ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ బట్టతల లుక్ పై క్లారిటీ ఇచ్చాడు. కథలో భాగంగానే బట్టతల లుక్‌లో కనిపించినట్లుగా తెలిపాడు.
దీనివల్ల మేకప్ కోసం తక్కువ సమయం పట్టిందని అన్నాడు. కానీ ఈ లుక్ బయటకు రాగానే.. నా ఫ్పెండ్స్ ఫొన్ చేసి అరేయ్ యార్ చాలా భయంగా ఉంది, అమ్మాయిలు ఇలా నిన్ను ఇష్టపడరు అంటూ కామెంట్స్ చేశారు. కానీ నేను అవేవి పట్టించుకోలేదు. ఎందుకంటే, అమ్మాయిలు బట్టతల ఉన్న మగాళ్లను ఇష్టపడతారని నేను నమ్ముతాను. అంతేకాదు.. నాకు కూడా బట్టతల ఉన్న అమ్మాయిలంటే చాలా ఇష్టం.. అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం షారుఖ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.