Jawan: ‘జవాన్’ కోసం జీరో పారితోషికం.. అంతా అబద్దం!
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. దీంతో ఈ సినిమాలో నటించిన వారి రెమ్యూనరేషన్ ఎంత? అనేది హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా దీపిక పదుకొనే దీనిపై క్లారిటీ ఇచ్చేసింది.
జవాన్ సినిమా సౌత్‌లోనే వంద కోట్లు దాటింది.. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీక్‌లో 700 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాలుగు రోజుల్లోనే 500 కోట్ల మార్క్‌ని టచ్ చేసిన జవాన్.. ఆరు రోజుల్లో 600 కోట్లు, 7 రోజుల్లో 700 కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్లో నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మళ్లీ వీకెండ్ మొదలయ్యింది కాబట్టి జవాన్ వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. సెకండ్ వీకెండ్‌తో ఫాస్టెస్ట్ 1000 కోట్ల గ్రాసర్‌గా జవాన్ కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పదుకొనే కీలక పాత్రలో నటించింది.
షారుఖ్ ఫాదర్ క్యారెక్టర్‌కు జోడిగా దీపిక కనిపించింది. ఆమెది గెస్ట్ రోలే అయినా సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్. అందుకే దీపిక ఏకంగా 30 కోట్ల పారితోషికం తీసుకుందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై స్పందించింది దీపిక. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అవన్నీ రూమర్సే అంటూ కొట్టి పారేసింది. ‘జవాన్’తో పాటు ఇటీవల వచ్చిన రణ్‌వీర్‌సింగ్ 83, సర్కస్ వంటి చిత్రాల్లో తాను అతిథి పాత్రల్లో నటించాను.
కథలు నచ్చడంతో ఆ సినిమాల్లో నటించాను. అంతే తప్ప ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని చెప్పింది. ముఖ్యంగా జవాన్ తనకు కథ బాగా నచ్చింది.. పైగా షారుఖ్ ఖాన్‌తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది.. తామిద్దరం మంచి ఫ్రెండ్స్.. అందుకే జవాన్ సినిమా కోసం తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ లెక్కన దీపిక జవాన్ కోసం దీపిక పారితోషికం జీరో అని చెప్పొచ్చు.