మణిరత్నం(Maniratnam) డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్(Ponniyan Selvan) ప్రాజెక్టు నుంచి రెండో పార్ట్ విడుదలైంది. థియేటర్లలో పొన్నియన్ సెల్వన్ 2(Ponniyan selvan 2) చూసిన వారు ఫస్ట్ సీన్‌ను మరచిపోలేరని చెప్పాలి. ఫస్ట్ షాట్లో ఓ టీనేజ్ అమ్మాయి స్నానం కోసం నదిలోకి దిగి తల వరకూ నదిలో మునిగి పైకి లేయగానే ఆమె స్వచ్ఛమైన ముత్యంలా మెరిసిపోతుంది. అంత అందంగా కనిపించిన నందిని అనే పాత్ర(Nandini Character) సినిమాకే హైలెట్ అయ్యింది.
పొన్నియన్ సెల్వన్ 2 మూవీ(Ponniyan selvan 2)లో నందిని పాత్రలో ఐశ్వర్యరాయ్(Iswaryarai) కనిపిస్తుండగా ఆమె ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో టీనేజ్ పాత్రను సారా అర్జున్(Sara Arjun) పోషించింది. 2011లో సారా అర్జున్ చైల్డ్ ఆర్టిస్టు(Child Artist)గా తన సినీ కెరీర్‌ను ప్రారంభించింది. హిందీ, తమిళ, మలయాళ భాషల్లో చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో సారా అర్జున్ నటించి మెప్పించింది. 2015లో ‘దాగుడుమూత దండాకోర్’ అనే మూవీలో రాజేంద్రప్రసాద్ (Rajendra prasad)తో కలిసి నటించి మంచి పేరు పొందింది.
నందిని పాత్ర పోషించిన సారా అర్జున్(Sara Arjun) తండ్రి కూడా నటుడే కావడం విశేషం. సారా అర్జున్ తండ్రి రాజ్ అర్జున్(Raj Arjun). ఆయన చాలా మూవీస్ లోనూ, వెబ్ సిరీస్‌ల్లోనూ, టీవీ సీరియల్స్‌లోనూ నటించి మెప్పించారు. తండ్రి బాటలోనే సారా అర్జున్ నటన పరంగా మంచి పేరు సాధిస్తోంది. పొన్నియన్ సెల్వన్ 1(Ponniyan selvan 1)లో ఆమె పాత్ర పూర్తి స్థాయిలో కనిపించదు. అయితే పొన్నియన్ సెల్వన్2(Ponniyan selvan 2)లో మాత్రం ఆదిత్య కరికలాన్ ను ప్రేమించే పాత్రలో గొప్పగా నటించింది. మూవీలో ఆమె నటన చూసిన వారు సారా అర్జున్ కు హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు.