బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ గురించి అందరికీ తెలిసిందే. ఆదిపురుష్‌లో రావణుడిగా, ఎన్టీఆర్ 30లో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్. సుశాంత్ సింగ్ సరసన 'కేదార్ నాథ్' అనే చిత్రంతో సారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగమ్మ.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఉజ్జయినిలో ప్రార్థనలు చేసింది.
మొన్న జరిగిన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ విజేతగా నిలిచింది. ఈ విజయాన్ని ధోని టీం ఫుల్లుగా సెలబ్రేట్ చేసుకుంది. ముఖ్యంగా గిల్ ప్రేయసి సారా అలీ ఖాన్ తెగ ఎంజాయ్ చేసింది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి ఫైనల్ మ్యాచ్ కు హాజరైన సారా, ఆఖరి బంతికి చెన్నై విజయం అందుకోగానే కేరింతలు కొట్టింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గుజరాత్ టీమ్ టీమ్ ప్లేయర్ గిల్, సారా అలీ ఖాన్ డేటింగ్లో ఉన్నారనే టాక్ ఉంది. అయినా అమ్మడు చెన్నైకి సపోర్ట్‌గా ఎంజాయ్ చేయడంతో.. గిల్ అభిమానులు హర్ట్ అయ్యారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఉజ్జయినిలో సారా అలీఖాన్ సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. మధ్య ప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో పూజలు నిర్వహించింది సారా అలీఖాన్. అక్కడ మిగతా భక్తులతో కలిసి.. సాధారణ భక్తురాలిగానే సారా అలీ ఖాన్ దేవుడిని పూజించింది. మహాకాళేశ్వరుడికి అభిషేకం చేసింది. తెల్లవారుజామున 4 నుండి 5:30 గంటల మధ్య బ్రహ్మ ముహూర్తంలో నిర్వహించిన పూజలో సారా పాల్గొంది. ఆలయ కమిటీ సంప్రదాయం ప్రకారం.. చీరలో నందిహాల్లో కూర్చుని పూజలు చేసింది. గర్భగుడి లోపల సారా జలాభిషేకం కూడా చేశారు. సారా అలీఖాన్ ఈ ఆలయాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి కాదు, సారా చాలాసార్లు ఇక్కడికి వచ్చి పూజలు చేసింది.