»Mahima Is The Richest Woman In Telugu States Rs 8700 Crore Property
Mahima Datla : తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ధనిక మహిళగా మహిమా..రూ.8700 కోట్ల ఆస్తి
హైదరాబాద్ నగరానికి చెందిన మహిమ 75 ఏళ్ల చరిత్ర గల హైదరాబాద్ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ లిమిటెడ్‌కు ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2022లో రూ.7700 కోట్లుగా ఉన్న మహిమా దాట్ల ఆస్తుల విలువ ఇప్పటి వరకూ రూ.8700 కోట్లకు చేరుకుంది.
ఇప్పుడు ప్రతి రంగంలోనూ మహిళలు దూసుకుపోతున్నారు. వ్యాపారాల్లో(Business) రాణిస్తూ తమదైన శైలిలో ముద్ర వేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మహిళలు వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు మహిమా(Mahima Datla). 45 ఏళ్లకే రూ.8700 కోట్లకు అధిపతి అయిన ఈ మహిమ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ధనిక మహిళగా నిలిచి వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిస్తున్నారు.
హైదరాబాద్ నగరానికి చెందిన మహిమ(Mahima Datla) 75 ఏళ్ల చరిత్ర గల హైదరాబాద్ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ లిమిటెడ్‌కు ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. 1953లో వెంకట క్రిష్ణంరాజు దాట్ల బయోలాజికల్ E (Biological E) అనే ఫార్మా కంపెనీ(Farma Company)ని స్థాపించారు. రక్తం గడ్డకట్టకుండా నిరోధించే హెపారిన్ (heparin)అనే మెడిసిన్ ను ఈ ఫార్మా సంస్థ కనుగొంది. క్రిష్ణంరాజు తర్వాత ఆయన కుమారుడు విజయ్ కుమార్ ఆ సంస్థను నడిపారు. విజయ్ కుమార్ తర్వాత ఇప్పుడు ఆయన కూతురు మహిమ కంపెనీని నడిపిస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో ఈ సంస్థ 100 కంటే ఎక్కువ దేశాలకు ఈ వ్యాక్సిన్ల(Vaccine)ను సరఫరా చేస్తోంది.
2022లో రూ.7700 కోట్లుగా ఉన్న మహిమా దాట్ల(Mahima Datla) ఆస్తుల విలువ ఇప్పటి వరకూ రూ.8700 కోట్లకు చేరుకుంది. ఆమె సంస్థ ఆస్తుల విలువ మొత్తంగా రూ.1000 కోట్లకు చేరుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ధనికుల్లో మహిమా దాట్ల 10వ స్థానంలో కొనసాగుతున్నారు. అత్యధిక ధనిక మహిళగా మహిమా దాట్ల మొదటి స్థానంలో ఉన్నారు.