తెలంగాణ రాష్ట్రం దశాబ్ది సంబురాలు జరుపుకొంటున్న సమయంలో, కేసీఆర్(CM KCR) ఈ సరికొత్త రికార్డును సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన తెలుగువారిలో అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్న రికార్డు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు(TDP chief leader Chandrababu Naidu) పేరిట ఉన్నది.
No chance for those who lost the last election.. Even for the Leaders Sons: CM KCR
CM KCR:తెలంగాణ రాష్ట్రం దశాబ్ది సంబురాలు జరుపుకొంటున్న సమయంలో, కేసీఆర్(CM KCR) ఈ సరికొత్త రికార్డును సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన తెలుగువారిలో అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్న రికార్డు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు(TDP chief leader Chandrababu Naidu) పేరిట ఉన్నది. ఆయన మూడు విడతల్లో మొత్తం 13 ఏండ్ల 247 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఆయన ఏకబిగిన ముఖ్యమంత్రి(Chief Minister)గా కొనసాగింది మాత్రం 8 ఏండ్ల 256 రోజులు మాత్రమే. తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన తెలుగు వ్యక్తిగా కేసీఆర్ నిలిచారు. కొత్త రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించిన సీఎం కేసీఆర్.. 2014 జూన్ 2న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి.. జూన్ 2తో తొమ్మిదేళ్లు సీఎంగా పదవీకాలం పూర్తి చేసుకోనున్నారు.
తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన తెలుగువారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. కాసు బ్రహ్మానందరెడ్డి ఏడేండ్ల 221 రోజులు, నారా చంద్రబాబునాయుడు ఎనిమిదేండ్ల 256 రోజులు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐదేండ్ల 111 రోజులు పదవిలో కొనసాగారు. వీరందరి కంటే ఎక్కువగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ జూన్ 2తో సరిగ్గా తొమ్మిది ఏండ్లను పూర్తి చేసుకోబోతున్నారు. దేశంలో మరే రాజకీయ నాయకుడికీ లేనంత ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ రాజకీయాల్లో కొనసాగి, అపూర్వమైన, అనితర సాధ్యమైన విజయాలు సాధించారు. కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్‌లాగా కేసీఆర్‌కు పెద్ద జాతీయ పార్టీల అండ లేదు. ఎన్టీఆర్‌లాగా సినీ ప్రజాకర్షణ లేదు. చంద్రబాబులాగా కుల బలం, మీడియా బలగం లేదు. ధన బలం అంతకంటే లేదు. అయినా కేసీఆర్ సుదీర్ఘకాలం 45 ఏండ్లు రాజకీయాల్లో కొనసాగడం, ఒక్కసారి మినహా ఎన్నడూ ఓటమిని ఎదుర్కొనకపోవడం, ఇప్పుడు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించడం విశేషం.