విజయవాడ బెంజిసర్కిల్‌లో ఎన్టీఆర్(NTR) శతజయంతి సభను నిర్వహించారు. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, డైరెక్టర్ ఆర్జీవీ(Director RGV), పోసాని కృష్ణమురళీ(Posani krishnamurali) వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో ఎన్టీఆర్(junior NTR), చంద్రబాబు(Chandrababu)పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఎన్టీఆర్ పాల్గొనకపోవడంతో తారక్‌కు ఆర్టీవీ థ్యాంక్స్ చెప్పారు. లక్ష్మీపార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారని చెప్పే టీడీపీ నేతలకు ఆయన్ని పూజించే హక్కు లేదన్నారు.
సభలో ఎన్టీఆర్, చంద్రబాబు గురించి మాట్లాడిన ఆర్జీవీ:
చంద్రబాబు(Chandrababu)పై ఆర్టీవీ(RGV) కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబును మొసలి, పాముతో పోల్చుతూ ఆర్జీవీ కామెంట్స్ చేశారు. కన్ను ఆర్పకుండా ఉండే పాము, మొసలి తర్వాత చంద్రబాబునే చూశానన్నారు. తాను తీసే ‘వ్యూహం’ సినిమా(Vyuham Movie)లో చంద్రబాబు క్యారెక్టర్ ఏంటో అరటి పండు ఒలిచినట్లు చూపిస్తానన్నారు. టీడీపీ(TDP) కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని ఆర్టీవీ అన్నారు.
ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన తారక్:
పోసాని కృష్ణమురళి(Posani Krishnamurali) మాట్లాడుతూ..ఎన్టీఆర్(NTR) నెంబర్ వన్ హీరో అని, ఆయన గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరని అన్నారు. చంద్రబాబు చేసే పనుల వల్ల ఎన్టీఆర్‌కు మూడు సార్లు గుండెపోటు వచ్చిందని, ఆయన్ని కడదాకా చిన్న పిల్లాడిలా చూసుకుంది లక్ష్మీ పార్వతి అని అన్నారు. చంద్రబాబు చేసే ప్రతి పని కూడా ఎన్టీఆర్ ను చిత్రవధ చేసిందని, ఆయన మరణానికి కారణం చంద్రబాబేనని అందరికీ తెలుసన్నారు.