Rangabali Full Movie Review: నాగశౌర్య, యుక్తి తరేజా నటించిన రంగబలి (Rangabali) సినిమా ఈ రోజు విడుదలైంది.
మూవీ:రంగబలి నటీనటులు:నాగశౌర్య, యుక్తి తరేజ, గోపరాజు రమణ, షైన్ టామ్ చాకో, సత్య, శరత్ కుమార్, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్, అనంత్ శ్రీరామ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, భద్రమ్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు ఛాయాగ్రహణం: దివాకర్ మణి సంగీతం: పవన్ నిర్మాతలు:సుధాకర్ చెరుకూరి రచన, దర్శకత్వం: పవన్ బాసంశెట్టి విడుదల తేదీ:జూలై 7, 2023
కథ:
శౌర్య (నాగశౌర్య) ఊరు రాజవరం.. గ్రామం అంటే అతనికి చాలా ఇష్టం. అదే అతని బలం, బలహీనత కూడా. సొంతూరులో గొప్పగా బతకాలని అనుకుంటాడు. ఏం చేసినా పది మంది తననే చూడాలని అనుకొని.. అప్పుడప్పుడు షో చేస్తుంటాడు. దీంతో అతని దోస్తులు షో అని పిలుస్తుంటారు. శౌర్య తండ్రి విశ్వం (గోపరాజు రమణ) ఊరిలో మెడికల్ షాపు నడుపిస్తుంటాడు. ఆ షాపును కొడుకుకు అప్పగించాలని అనుకుంటాడు. శౌర్య మాత్రం డిఫరెంట్.. ఊరిలో గొడవలు పెట్టుకుంటూ.. తన షాపులో దొంగతనాలు చేస్తూ సరదాగా గడుపుతుంటాడు. అతనిని దారిలో పెట్టేందుకు తండ్రి వైజాగ్ పంపించగా.. ఫార్మసీ ట్రైనింగ్ కోసం ఓ మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతాడు. అక్కడ సహజ (యుక్తి తరేజ)తో ప్రేమలో పడతాడు. వీరి ప్రేమకు సహజ తండ్రి (మురళీ శర్మ) ఫస్ట్ ఓకే అంటాడు. శౌర్య ఊరి పేరు తెలిసి అడ్డు చెబుతాడు. ఆ ఊరిలో రంగబలి సెంటర్. ఆ సెంటర్ కథేంటీ..? దానికి రంగబలి అని పేరు ఎందుకొచ్చింది..? సెంటర్‌కు మురళీ శర్మకు, ఊరిలోనే ఎమ్మెల్యే పరశురామ్ (షైన్ టామ్ చాకో)కు ఉన్న సంబంధం ఏంటీ..? సెంటర్ పేరు మార్చి, తన ప్రేమను పెళ్లి పీటాలు ఎక్కించేందుకు శౌర్య ఏం చేశాడనేదే సినిమా కథ.
ఎలా సాగిందంటే..
శౌర్య పాత్ర వ్యక్తిత్వాన్ని.. ఊరితో తనకు ఉన్న అనుబంధాన్ని పరిచయం చేస్తూ మూవీ ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంటుంది. వినాయకుడి విగ్రహాం కోసం పక్క ఊరి కుర్రాళ్లతో ఫైట్‌కు దిగుతాడు. సత్య పాత్ర వినోదం పంచుతుంది. ఫస్ట్ హాఫ్‌కు సత్య కామెడీ హైలెట్‌గా నిలుస్తోంది. శౌర్య, అతని తండ్రికి మధ్య వచ్చే సన్నివేశాలు ఫన్నీగా ఉంటాయి. ఇక శౌర్య వైజాగ్ వెళ్లడంతో మూవీలో ఫన్ పెరుగుతుంది. అక్కడ సహజను తొలి చూపులోనే ఇష్టపడతాడు. వీరి లవ్ ట్రాక్ రెగ్యులర్‌గా ఉంటుంది. ఇంటర్వెల్‌కు ముందు ఓ ట్విస్ట్‌తో కథ ఆరంభించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్ స్టార్ట్ కాగానే మూవీ సీరియస్ మూడ్‌లోకి వెళ్లిపోతుంది. రంగబలి సెంటర్ పేరు మార్చాలని శౌర్య ప్రయత్నించగా.. ఎమ్మెల్యేతో గొడవ జరుగుతుంది.
ఎవరెలా చేశారంటే..?
మూవీలో శౌర్య పక్కింటి కుర్రాడి లాగా కనిపిస్తాడు. యాక్షన్ సన్నివేశాల్లో ఎనర్జీగా ఉంటాడు. సహజ పాత్రలో యుక్తి న్యాచురల్‌గా ఉంటుంది. సత్య కామెడీ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఫస్ట్ హాఫ్‌కు సత్యనే మెయిన్ లీడ్ అయ్యాడు. గోపరాజు రమణ, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్ పాత్ర పరిధి మేరకు నటించారు. శతర్ కుమార్ గెస్ట్ రోల్ పోషించారు. పాటలు అంతగా ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. కథకు తగినట్టు నిర్మాణ విలువలు ఉన్నాయి.
ప్లస్
+ నాగ శౌర్య నటన
+ సత్య కామెడీ
మైనస్
– అంతగా ఆకట్టుకొని కథనం
– పేలవంగా పతాక సన్నివేశాల చిత్రీకరణ
– వీక్ క్లైమాక్స్