RenuDesai: కోరిక పది నిమిషాలే, కానీ మార్పు ఇదే.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక.. ఇంకో పెళ్లి చేసుకోకుండా.. ప్రస్తుతం పవన్ మాజీ భార్యగానే ఉంది రేణు దేశాయ్. ఇద్దరు పిల్లలను తన దగ్గరే ఉంచుకొని చూసుకుంటోంది. ఇక రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే.. అప్పుడప్పుడు అకిరా నందన్ గురించి పోస్ట్‌లు పెట్టే రష్మిక.. ఇంకొన్ని సోషల్ యాక్టివిటీస్‌కు సంబందించిన ఫోటోలు కూడా షేర్ చేస్తుంటుంది. తాజాగా షేర్ చేసిన ఇన్ స్టా స్టోరీ వైరల్‌గా మారింది.
పవర్ స్టార్‌తో విడిపోయాక పిల్లలతోనే కాలం గడుపుతోంది రేణు దేశాయ్. కొడుకు అకీరా నందన్‌ను హీరోగా నిలబెట్టేందుకు ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇప్పిస్తోంది. అప్పుడప్పుడు అకిరా నందన్‌కు సంబంధించిన పోస్ట్‌లు పెడుతుంటుంది. కానీ అకీరా హీరోగా ఎప్పుడు లాంచ్ అవుతాడనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వదు. ఇక అకీరాతో పాటు ఇంకొన్ని సోషల్ యాక్టివిటీస్‌కు సంబందించిన ఫోటోలు కూడా షేర్ చేస్తుంటుంది. తాజాగా షేర్ చేసిన ఇన్ స్టా స్టోరీ వైరల్‌గా మారింది. మాములూగా రేణూ దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో వేగన్స్ గురించి ఎక్కువగా చెబుతుంటుంవి. అందుకే.. పాల కోసం ఆవులను, గేదెలను ఎంతలా హింసిస్తారో చూపించే వీడియోలను షేర్ చేస్తుంటుంది.
అలాగే మీట్ ఇండస్ట్రీ కోళ్లు, మేకలను ఎలా చంపేస్తుంటారో చూపిస్తుంటుంది. దాంతో.. అలాంటి పోస్టులు ఎందుకు పెడుతుంటారని? ఆమెను అడుగుతుంటారు నెటిజన్స్. కానీ అలా చేయడం వల్లే మార్పు మొదలైందని.. ఓ నెటిజన్ చెప్పిన వీడియోని, ఓ నోట్‌ని షేర్ చేసింది రేణు. ‘ఇంత క్రూయల్ వీడియోలు, ఫోటోలు ఎందుకు షేర్ చేస్తుంటావ్.. అవి ఎందుకు ఉపయోగపడుతూ ఉంటాయ్? అని నా ఫ్రెండ్స్ చాలా మంది నన్ను అడుగుతుంటారు. ఇలాంటి ప్రశ్నలు గత కొన్నేళ్లు నన్ను అడుగుతూనే వచ్చారు. కానీ ఇప్పుడు జంతు హింస గురించి మేం ఆలోచిస్తున్నాం. పది, పదిహేను నిమిషాల నాలుక రుచి కోసం.. తినాలనే కోరిక కోసం మనం జంతువులను చంపేస్తున్నామా? అని ఆలోచించడం ప్రారంభించారని రాసుకొచ్చింది.
అలాగే.. మాంసహారులను మళ్లీ ఆలోచించమని అడుగుతున్నాను.. మనతో పాటే జీవించే హక్కున్న ఆ అమాయకపు జంతువులను చంపి తినే ముందు మళ్లీ ఓ సారి ఆలోచించండి.. అని రేణూ దేశాయ్ వేడుకుంది. దీనికి ఓ నెటిజన్ చెప్పిన మెసేజ్‌ను యాడ్ చేసింది. ‘మీరు షేర్ చేసిన వీడియోను చూసి షాక్ అయ్యాను.. అస్సలు చూడలేకపోయాను.. అప్పటి నుంచి నాన్ వెజ్ తినడం మానేశాను.. అసలు ఆ ఊహే నాకు రావడం లేదు.. ఆ వీడియో నన్ను పూర్తిగా చంపేసింది.. అంటూ ఓ నెటిజన్ రేణూ దేశాయ్‌కి మెసెజ్ పెట్టాడు. ఆ మెసెజ్నే రేణూ దేశాయ్ షేర్ చేసింది. మొత్తంగా.. రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియోల వల్ల.. ఓ వ్యక్తి మాంసాహారాన్ని తినడం ఆపేశాడని చెప్పొచ్చు.