»Release Date Announced For Gandhiwadhari Arjuna Varun Tej Ready For Competition
Varun Tej: రిలీజ్ డేట్ ప్రకటించిన ‘గాంఢీవధారి అర్జున’..పోటీకి వరుణ్ తేజ్ సిద్ధం
హీరో వరుణ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా 'గాంఢీవధారి అర్జున' మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఆగస్ట్ 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ‘గాంఢీవధారి అర్జున’ సినిమా(Gaandivadhaari Arjuna Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం(Director Praveen sattaaru) వహిస్తున్నారు. ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్(Action Entertainer)గా తెరకెక్కుతోంది. ఆగస్ట్ 25న ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డిఫరెంట్ కాన్సెప్ట్(Different Concept)తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి పోస్టర్స్ రిలీజ్(Poster Release) అయ్యాయి. వరుణ్ తేజ్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ‘గాంఢీవధారి అర్జున’ మూవీ(Gaandivadhaari Arjuna Movie)కి సంబంధించిన బీటీఎస్ వీడియో గ్లింప్స్ రిలీజ్ అయ్యి మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం విదేశాల్లో ఈ మూవీ యూనిట్ వేగంగా షూటింగ్(Shooting) జరుపుకుంటోంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హైలెట్‌గా నిలువనున్నాయని మేకర్స్ తెలిపారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని, ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా త్వరలోనే మొదటుపెడతామని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ మూవీ వరుణ్ తేజ్(Varun Tej) కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అని మేకర్స్ తెలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మిక్కి జె.మేయర్(Mikky J Meyer) ఈ సినిమా(Gaandivadhaari Arjuna Movie)కు సంగీతం అందిస్తున్నారు. ముఖేష్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్‌ను అందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.