లేడీ సూపర్ స్టార్ నయనతార(nayanthara) షాకింగ్ నిర్ణయం తీసుకుంటోంది. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పాలని అనుకుంటోందట. ప్రస్తుతం అంగీకరించిన సినిమాలు పూర్తైన తర్వాత ఆమె కొత్తగా ఏ సినిమాను అంగీకరించాలని అనుకోవడం లేదట. తన పిల్లలను చూసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని, వాళ్లను తానే స్వయంగా చూసుకోవాలని అనుకుంటుందట. అందుకే ఆమె మూవీలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటుందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం.
స్టార్ హీరోయిన్ నయనతార(nayanthara) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బ్యూటీ సీక్రెట్ బయట పెట్టిన ఆమె మరో కీలక విషయాన్ని వెల్లడించింది. నయనతార బరువు తగ్గడానికి ఫిట్నెస్ మైంటైన్ చేయడానికి కారణం ఆమె చేసే జిమ్ వర్కౌట్, యోగాలే ప్రధాన కారణం అని తెలుస్తోంది. ముఖ్యంగా నయనతార ఫిట్నెస్ కి యోగా బాగా ఉపకరించింది అని..అందుకే ఆమె ఇంత పర్ఫెక్ట్ ఫిగర్ ను మైంటైన్ చేస్తోందని సమాచారం. ఇకపోతే డైట్ ప్లానింగ్ లో కచ్చితంగా కొబ్బరి నీళ్ళు తప్పకుండా ఉండాల్సిందేనట. రోజూ రెండు గంటలు యోగా చేస్తుందట. అల్పాహారంలో పళ్ళ రసం తప్పనిసరిగా తీసుకుంటారట.
ఇక మధ్యాహ్నం భోజనం(food)లో మాంసాహారం, గుడ్డు, కాయగూరలు సమపాళ్లలో తీసుకుంటుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ కలిగిన పదార్థాలకు దూరంగా ఉంటారట. ఇక సరైన నిద్ర కూడా మన బరువును అదుపులో ఉంచుతుంది. నయన్ రోజుకు 8 గంటలు నిద్రపోయేలా తన షెడ్యూల్ను ప్లాన్ చేసుకుంటారట. నయనతార కొంతకాలం పాటు నటనకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తిచేసిన తరువాత, కొంతకాలం పాటు సినిమాలను పక్కన పెడుతుందని అంటున్నారు. పిల్లల ఆలనా పాలన స్వయంగా చూసుకోవడం కోసమే ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం. పిల్లల ఆలనా పాలన స్వయంగా చూసుకోవడం కోసమే ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.