Priyanka Arul Mohan: మళ్లీ క్యూ కడుతున్న ఆఫర్లు.. లక్ మారేనా..?
హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. హీరోల మాదిరి ఎక్కువ సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగలేరు. చాలా తక్కువ మంది మాత్రమే దశాబ్దాలపాటు కొనసాగతారు. అది కూడా వరసగా హిట్లు దక్కినప్పుడే. అదే, హీరోయిన్ కి వరసగా రెండు, మూడు ప్లాప్ లు పడితే.. మళ్లీ ఆమెను సినిమాల్లో తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించరు.
హీరోల కంటే హీరోయిన్ల జీవితాలు వేరుగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ వారు పాత్రలను మారిపోవాల్సి వస్తుంటుంది. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. చాలా తక్కువ కాలంలోనే హీరోయిన్లు ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. సెకండ్ ఛాన్స్ రావడం అనేది చాలా అరుదు. అయితే ఓ హీరోయిన్ కి మాత్రం ఇప్పుడు సెకండ్ ఛాన్స్ వచ్చింది. ఆమెవరో కాదు ప్రియాంక అరుల్ మోహన్.
ప్రియాంక అరుల్ మోహన్ మంచి నటనా నైపుణ్యం ఉన్న క్లాసిక్ బ్యూటీ. చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. టాలీవుడ్లో పాతుకుపోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ, టాలీవుడ్ లో తన మొదటి రెండు చిత్రాలైన “గ్యాంగ్ లీడర్”, “శ్రీకారం” బాక్సాఫీస్ వద్ద విఫలమవడంతో టాలీవుడ్లో సవాలుతో కూడిన ఆరంభాన్ని పొందింది. రెండు సినిమాలు ప్లాప్ కావడంతో, ఇక టాలీవుడ్ నుంచి తప్పుకున్నట్లే అని అందరూ అనుకున్నారు. కానీ ఆమెకు మరోసారి సెకండ్ ఛాన్స్ రావడం విశేషం.
ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకు సైన్ చేస్తోంది ప్రియాంక. ఆమె ఇప్పటికే పవన్ కళ్యాణ్ “OG” లో నటిస్తోంది. తాజాగా మరో మూవీలో ఆఫర్ దక్కించుకుంది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సరిపోదా శనివారం” లో హీరోయిన్ గా ఆఫర్ దక్కించుకుంది. అదనంగా ఆమె రవితేజతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక చిత్రానికి సైన్ చేసింది. ఈ ప్రాజెక్ట్‌లో రష్మిక మందన్న స్థానంలో ఆమె ఎంపికైనట్లు ఇన్సైడ్ రిపోర్ట్స్ సూచిస్తున్నాయి. తమిళ చిత్రసీమలో ధనుష్ , జయం రవి సోదరుడితో కలిసి ప్రియాంక “కెప్టెన్ మిల్లర్”లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆమెకు మరికొన్ని కూడా ఆఫర్ చేస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి. అవి త్వరలో ప్రకటించనున్నారు. మరి ఆమె ఈ సెకండ్ ఛాన్స్ ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.