»Ram Charan Interesting Birthday Wishes For Samantha
Samantha : సమంతకు రామ్ చరణ్ ఆసక్తికరంగా బర్త్ డే విషెస్..
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా సామ్ ను విష్ చేశారు.
నేడు సమంత (Samantha) పుట్టిన రోజు కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్ ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కూడా ట్విట్టర్ వేదికగా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపాడు. “డియర్ సమంత నీ వర్క్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నీకు మంచి ఆరోగ్యం, విజయాలు కలగాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్ డే అండ్ సిటాడెల్ కి గుడ్ లుక్” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ (tweet viral) అవుతుంది. ఇక ఈరోజు సమంత 36వ పుట్టినరోజు కావడంతో ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటుడు దేవ్ మోహన్, లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి, నాగ్ అశ్విన్, రష్మిక మందన్న, కీర్తి సురేష్(Keerthy Suresh), అనుష్క శర్శ, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తమ బెస్ట్ విషెస్ తెలిపారు. సమంత దీనికి ఏమని రిప్లై ఇస్తుందా? అని చరణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సమంత కలిసి రంగస్థలం సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే. ఆ సినిమాలో చిట్టిబాబు(Chittibabu)గా చరణ్, రామలక్ష్మిగా సమంత అందరి మనసులు దోచుకున్నారు.
వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తే చూడాలని అభిమానులు అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చరణ్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటే, సమంత పాన్ ఇండియా(Pan India) వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది. సిటాడెల్ (Citadel) అనే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.ఇక సమంత నటిస్తున్న సిటాడెల్.. అమెరికన్ అండ్ ఇండియన్ వెర్షన్ లో తెరకెక్కుతుంది. అమెరికన్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సమంత పాత్ర చేస్తుంది. ఇటీవల అమెరికన్ సిటాడెల్ టీజర్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకుంది. ఆ టీజర్ లో ప్రియాంక చోప్రా స్టంట్స్ చూసి సమంత ఏ రేంజ్ లో చేసిందో అని ఎదురు చూస్తున్నారు. గతంలో సమంతతో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ – డికే డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మేల్ లీడ్ చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్’ (RRR)తో గ్లోబల్ స్టార్ గానూ మారిపోయారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు ఎస్ శంకర్ (S Shankar) డైరెక్షన్ లో ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నారు. ఇక సమంత ‘సిటడెల్’ సిరీస్ తో పాటు విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి(Khushi)’లో నటిస్తున్న విషయం తెలిసిందే.
Dearest @Samanthaprabhu2! Extremely proud of you and your amazing work. Wishing you great health and success. Happy Birthday and good luck with #Citadel