గతేడాది చివర్లో ‘అఖండ’ మూవీతో థియేటర్‌ను షేక్ చేసిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్‌తో భారీ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియా మూవీ కావడంతో.. భారీ అంచనాలున్నాయి. ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ బాట పట్టిన రామ్.. ఇటీవల వచ్చిన ‘ది వారియర్’తో మెప్పించలేకపోయాడు. దాంతో బోయపాటి సినిమా పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు.
అందుకు తగ్గట్టే బోయపాటి.. రామ్ కోసం హై ఓల్టేజ్ యాక్షన్ స్క్రిప్టు రాసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రామ్-బోయపాటి సినిమా షూటింగ్ మొదలైపోయింది. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. ఈ సినిమాలో సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ భారీ సెట్లో యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారట. స్టంట్ మాస్టర్ శివ దర్శకత్వంలో ఈ యాక్షన్ జరుగుతోందట.
ఈ షెడ్యూల్ సినిమాకు అత్యంత కీలకమని తెలుస్తోంది. దాంతో రామ్‌ను బోయపాటి ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి పెరిగిపోతోంది. అయితే ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఈ సినిమాలో రామ్ డ్యూయెల్ రోల్లో కనిపిస్తాడని టాక్. అందులో ఒకటి కాలేజ్ లెక్చరర్‌గా నటిస్తున్నాడట. దాంతో రెండు విభిన్న పాత్రల కోసం రామ్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. మరి రామ్‌తో బోయపాటి ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేస్తున్నాడో తెలియాలంటే.. సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.