దర్శక ధీరుడు రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయంలో క్లారిటీ లేదు. అయితే రాజమౌళి అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా..
సందర్భం వచ్చినప్పుడల్లా ఈ ప్రాజెక్ట్ గురించి చెబుతున్నాడు. ఆ మధ్యలో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది తెరకెక్కబోతోందని చెప్పుకొచ్చాడు. అలాగే గతంలో రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రపాద్.. మహేష్‌తో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు మరోసారి క్రేజీ అప్టేట్ ఇచ్చాడు జక్కన్న.
తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో ఇంటరాక్షన్‌లో మహేష్ సినిమాపై స్పందించాడు. ‘మా నాన్న గారు.. నేను కొన్ని నెలల క్రితం స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాం. అయితే అది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.. కాబట్టి ఇప్పుడే దాని గురించి పెద్దగా వెల్లడించలేను. కానీ ఇది ఇండియానా జోన్స్ రేంజులో అడ్వంచర్ మూవీ అని చెప్పగలను. ఎప్పటినుండో అడ్వెంచర్ థ్రిల్లర్ చేయాలనుకుంటున్నాను.. అది ఎట్టకేలకు ఇప్పుడు సాధ్యమవుతోంది’ అని అన్నారు రాజమౌళి. అలాగే ‘ఇది ప్రపంచాన్ని చుట్టే సాహసం’ అని అన్నారు.
దాంతో ఈ సినిమా హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో రానుందని చెప్పొచ్చు. మహేష్ కెరీర్లో 29వ సినిమా రానున్న ఈ ప్రాజెక్ట్‌ని కే.ఎల్ నారాయణ.. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎస్ఎస్ఎంబీ28 మూవీ చేస్తున్నారు. ఇది కంప్లీట్ అవగానే ఎస్ఎస్ఎంబీ29 సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది మిడ్‌లో ఈ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.