మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ఏ సినిమా చేసినా అందులో ప్రత్యేకత ఏదోకటి ఉంటుంది. సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో నటుడిగా, డైరెక్టర్‌గా, రైటర్‌గా, సింగర్‌గా తనకంటూ పృథ్వీరాజ్ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ది గోట్ లైఫ్(The Life Goat) అనే సినిమాలో పృథ్వీరాజ్ నటించారు. ఆ మూవీ తెలుగు ట్రైలర్(Telugu Trailer)ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్లో పృథ్వీరాజ్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

తెలుగులో ‘ఆడుజీవితం'(Adujivitham) అనే టైటిల్‌తో ఈ మూవీ విడుదల కాబోతోంది. మూవీ విషయానికి వస్తే ఇదొక కేరళకు సంబంధించిన కథాంశంగా తెలుస్తోంది. ఇందులో పృథ్వీరాజ్(Prithviraj) జాబ్ చేయడానికి సౌదీ అరేబియాకు వెళ్లగా దుబాయ్ ఎడారిలో మేకల కాపరిగా పని చేస్తాడు. అయితే అక్కడున్నవారు పృథ్వీరాజ్ ను బానిసగా చూస్తుంటారు. ఆ టైంలోనే హీరో అనేక సమస్యలను ఎదుర్కొంటాడు. తిరిగి ఇండియా(India)కు వెళ్లాలని ఎడారిలో ప్రయాణం ప్రారంభిస్తాడు.
పృథ్వీరాజ్(Prithviraj) ప్రయాణంలో ఎడారిలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడో, ఆఖరికి ప్రాణాలతో ఇండియాకు వచ్చాడా? లేదా? అనేదే ఈ కథ సారాంశంగా తెలుస్తోంది. నేషనల్ అవార్డు విన్నర్ అయిన బ్లెస్సీ(Blessi) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో అమలాపాల్(Amalapaul) హీరోయిన్గా నటించింది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్(AR Rahman) మ్యూజిక్ అందించాడు.
బ్లెస్సీ, కెజీ అబ్రహం, జిమ్మీ జీన్ లూయిస్ సంయుక్తంగా ‘ఆడు జీవితం'(Adujivitham) సినిమాను రూపొందించారు. ఈ సినిమా సర్వైవల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ మూవీని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా ప్రదర్శించారు. ఇదే తరహా కథతో గతంలో లైఫ్ ఆఫ్ ఫై(Life of PI) అనే సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. మరి ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుని ఆస్కార్(Oscar) సాధిస్తుందో లేదో చూడాలి.