»Prabhudeva Who Got Married For The Second Time The Real Truth That Came Out
Prabhudeva : రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా.. బయటపడ్డ అసలు నిజం
దర్శకుడిగా, కొరయోగ్రాఫర్‌గా కెరియర్లో సక్సెస్ పుల్గా దూసుకెళ్తున్నాడు ప్రభుదేవా(Prabhudeva) . అయితే.. ఈ ఇండియన్ మైఖేల్ జాక్సన్ రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుస్తోంది.
ఇండియన్ మైకెల్ జాక్సన్(Michael Jackson)గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా (Prabhudeva) స్టార్ కొరియోగ్రఫర్‌గా, మంచి నటుడిగా, డైరెక్టర్‌గా తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. ప్రభుదేవా పర్సనల్ లైఫ్‌లో ఎన్నో వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా తన మొదటి భార్యతో గొడవలు, డైవర్స్.. ఆ తర్వాత హీరోయిన్ నయనతార(Nayanthara)తో ప్రేమాయణం ఇలా తరచుగా ఆయన వార్తల్లో ఉన్నారు. అయితే 2020లో కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుదేవా.. హిమానీ సింగ్(Himani Singh)ను రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ ఎప్పుడూ వీరిద్దరూ బయట కలిసి కనిపించలేదు. తాజాగా వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభుదేవా మొదటి భార్య రామలతా. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వీరి జీవితంలోకి నయన తార ఎంట్రీ ఇచ్చింది.
ప్రభుదేవాతో నయనతార ప్రేమాయణం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రభుదేవా కోసం నయనతార హిందూ మతంలోకి మారింది. వివాహం కూడా అవుతుందనుకున్న సమయంలో మొదటి భార్య విడాకులకు ఒప్పుకోకపోవడం, నయనతారను టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో వీరి ప్రేమకు పుల్ స్టాప్ పడింది. 2011లో రామలత(Ramalata)కు ఇండియన్ మైకెల్ జాక్సన్ విడాకులు ఇచ్చారు. అయితే ప్రభుదేవా కరోనా సమయంలో ఎవరికి తెలియకుండా హిమానీని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం డ్యాన్స్ మాస్టర్, ప్రభుదేవా తమ్ముడు రాజుసుందరం కారణంగా బయటకు రావడం ప్రస్తుతం సంచలనం గా మారింది. కొన్ని రోజుల క్రితం ప్రభుదేవా పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ వీడియోలో హిమానీ (Himani) మాట్లాడుతూ.. ప్రభుదేవాను మ్యారేజ్ చేసుకోవడం తన లక్ అని తెలిపింది. ఇటీవల ఈ జంట తిరుమలలో అడుగులో అడుగు వేస్తూ సందడి చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.