షూటింగ్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న.. లీక్ రాయుళ్లపై లీగల్‌గా యాక్షన్ తీసుకుంటామని హెచ్చరికలు చేసినా.. లీకులు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా ఈ మధ్యన స్టార్ హీరోల ఆన్ లొకేషన్ ఫోటోలు, వీడియోలు లీక్ అవుతూనే వున్నాయి. గతంలో రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న RC15 ఆన్ లొకేషన్ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అలాగే ప్రభాస్ లేటెస్ట్ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సలార్’ మూవీకి కూడా లీకుల బెడద తప్పడం లేదు.
ఇప్పటికే లీక్ అయిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతునే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరోసారి ‘సలార్’ ఆన్ సెట్ ఫోటోలు లీక్ అయ్యాయి. కృష్ణంరాజు మృతి తర్వాత కొన్నిరోజుల పాటు షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్.. రీసెంట్గా ‘సలార్’ సెట్లోకి అడుగు పెట్టాడు. తాజాగా ఈ షెడ్యూల్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ ఫోటోలు యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించినవిగా ఉన్నాయి. ఇందులో ప్రభాస్ ఊరమాస్‌గా రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కానీ ఇలాంటి లీకులు జరగకుండా చూడాలని మేకర్స్‌ను కోరుతున్నారు. అయితే ఇప్పటి వరకు లీక్ అయిన ‘సలార్’ ఫోటోలు చూస్తుంటే.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని ఊహకందని విధంగా తెరకెక్కిస్తున్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘సలార్’ లేటస్ట్ షెడ్యూల్ రేపో, మాపో కంప్లీట్ చేసుకొనుందని తెలుస్తోంది.