»Prabhas Marriage News Another Time Troll In Social Media
Prabhas పెళ్లిపై మళ్లీ చర్చ.. ఇంతకీ దేవసేన దొరికిందా? లేదా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై మళ్లీ చర్చ జరుగుతోంది. డార్లింగ్ పెళ్లి చేసుకునే అమ్మాయి దొరికిందని.. త్వరలో ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని టాక్.
Prabhas Marriage News Another Time Troll In Social Media
Prabhas:యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) పెళ్లిపై మళ్లీ చర్చ జరుగుతోంది. అప్పుడెప్పుడో బాహుబలి మూవీ తర్వాత పెళ్లి అని చెప్పినా.. ఇంతవరకు కాలే. దీనిపై ఎన్నిసార్లు మీడియా అడిగినా.. ప్రభాస్ (Prabhas) స్మైల్ ఇచ్చి ఊరుకున్నాడు. కానీ ఈ సారి మాత్రం పెళ్లి (marriage) ఖాయం అంటున్నారు. పెళ్లి చేసుకునే అమ్మాయి దొరికిందని.. త్వరలో ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని టాక్.
ప్రభాస్ (Prabhas) పెళ్లి కోసం ఆయన అభిమానులు (fans) వెయిట్ (wait) చేస్తున్నారు. ప్లీజ్.. పెళ్లి చేసుకో.. డార్లింగ్ (darling) అని కోరేవారు. బయటతోపాటు.. ఇంట కూడా ప్రభాస్‌పై (Prabhas) ఒత్తిడి పెరిగిందట. దీంతో ఆయన కూడా ఓకే అన్నారని.. దీనికి సంబంధించి త్వరలో ప్రకటన వస్తోందని తెలిసింది.
అమ్మాయి (girl) ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. బంధువుల అమ్మాయా? లేదంటే ఇండస్ట్రీకి చెందినవారా అనే విషయంలో క్లారిటీ లేదు. ఒకప్పుడు అనుష్క శెట్టి (anushka shetty) పేరు వినిపించింది. వారిద్దరూ మేమిద్దరం మంచి స్నేహితులమే అని చెప్పారు. ఆ తర్వాత ఆ విషయాన్ని అంతా మరచిపోయారు. ఇప్పుడు పెళ్లి చేసుకునే అమ్మాయి వివరాలు మాత్రం తెలియలేదు.
ఆదిపురుష్ మూవీ చివరి షెడ్యూల్‌కు వచ్చింది. సలార్, మారుతీ మూవీలో ప్రభాస్ (Prabhas) చేతిలో ఉన్నాయి. ఆదిపురుష్ జూన్‌లో రిలీజ్ అవుతుండగా.. సలార్ సెప్టెంబర్‌లో ప్లాన్ చేశారు. ఇంతలో డార్లింగ్ (darling) పెళ్లి అని తెలియగానే అభిమానుల్లో (fans) జోష్ మాములుగా లేదు.