Prabhas-Mahesh-Pawan: ప్రభాస్, మహేష్, పవన్ సినిమాలకు పొలిటికల్ దెబ్బ!
సంక్రాంతి అంటేనే.. సినిమాల సందడి మామూలుగా ఉండదు. ఏ హీరో అయిన సరే.. సంక్రాంతి బరిలో ఉండాలనుకుంటారు. మేకర్స్ అయితే పట్టుబట్టి మరీ సంక్రాంతికి తమ తమ సినిమాల8 రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయినా సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశాయి. వచ్చే సంక్రాంతికి ప్రభాస్, మహేష్ బబు, పవన్ సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. కానీ వాళ్లకు పొలిటికల్ సెగ కాస్త గట్టిగానే తగిలేలా కనిపిస్తోంది.
మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలు.. పోయిన సంక్రాంతికి రచ్చరచ్చ చేశాయి. భారీ వసూళ్లను అందుకొని కెరీర్ బెస్ట్‌గా నిలిచాయి. ఇక నెక్స్ట్ సంక్రాంతికి ప్రభాస్, మహేష్ మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’.. జనవరి 12న భారీ ఎత్తున థియేటర్లోకి రాబోతోంది. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఇక నెక్స్ట్ డే.. అంటే జనవరి 13న మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం రిలీజ్ కానుంది. రీసెంట్గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇప్పటికే ఈ రెండు సినిమాలు అధికారికంగా తమ రిలీజ్ డేట్‌ను ప్రకటించాయి. అయితే వచ్చే సంక్రాంతి బరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా దిగబోతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అలాగే శంకర్, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా.. లేదంటే శంకర్,కమల్ హాసన్ ‘ఇండియన్2’ థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా సంక్రాంతికి సినిమాల జాతర ఓ రేంజ్లో ఉండబోతోంది. కానీ ఈ సినిమాలకు పొలిటికల్ దెబ్బ పడేలా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను డిసెంబర్, జనవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగే ఛాన్స్ ఉంది. ఈ ఎన్నికల ప్రభావం సినీ పరిశ్రమపై గట్టిగానే పడే అవకాశం ఉంది. సంక్రాంతికి అటు ఇటుగా ఎప్పుడు ఎలక్షన్స్ ఉన్నా.. ప్రభాస్, మహేష్, పవన్ సినిమాలకు గట్టి ఎదురు దెబ్బ తప్పదంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో!