Jr.NTR : ఇప్పటి నుంచే ఎన్టీఆర్ 30కి ఓ రేంజ్లో ఎలివేషన్ ఇస్తున్నారు నందమూరి అభిమానులు. కొరటాల చెప్పిన మృగాల కథను నెక్స్ట్ లెవల్లో ఊహించుకుంటున్నారు. మరిచిపోయిన కోస్టల్ ప్రాంతంలో.. మృగాలను భయపెట్టే కథే.. ఎన్టీఆర్ 30 అని చెప్పుకొచ్చాడు కొరటాల.
ఇప్పటి నుంచే ఎన్టీఆర్ 30కి ఓ రేంజ్లో ఎలివేషన్ ఇస్తున్నారు నందమూరి అభిమానులు. కొరటాల చెప్పిన మృగాల కథను నెక్స్ట్ లెవల్లో ఊహించుకుంటున్నారు. మరిచిపోయిన కోస్టల్ ప్రాంతంలో.. మృగాలను భయపెట్టే కథే.. ఎన్టీఆర్ 30 అని చెప్పుకొచ్చాడు కొరటాల. అప్పటి నుంచి బాక్సాఫీస్ దగ్గర భయమంటే ఏంటో చూపిస్తామని అంటున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. ఇదే ఇలా ఉంటే.. షూటింగ్ సెట్లో ఏకంగా బ్లడ్ ట్యాంక్స్ ఫోటోలు లీక్ అవడం.. ఇప్పుడు అంచనాలను మించిపోయేలా చేస్తోంది. మామూలుగా మనం వాటర్ ట్యాంక్స్ లేదంటే మిల్క్ ట్యాంక్స్ చూస్తు ఉంటాం.. కానీ కొరటాల మాత్రం.. ఎన్టీఆర్ కోసం బ్లడ్ ట్యాంక్స్ రెడీ చేయించారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. కానీ చిత్ర యూనిట్ యాక్షన్ తీసుకోవడంతో.. ఆ ఫోటోలు డిలీట్ చేసేశారు. అయితే అప్పటికే నెట్టింట్లో ఆ బ్లడ్ ట్యాంక్ ఫోటోలు వైరల్ అయిపోయాయి. ఇక ఈ ఫోటోలు చూసిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోతోంది. ఈసారి కొరటాల ఊహకందని యుద్ధాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడని అంటున్నారు. మృగాలను భయపెట్టాలంటే.. వాటికి మించి శక్తి కలిగిన మృగం అయినా అయి ఉండాలి.. లేదంటే అంతకుమించి పవర్ ఫుల్ క్యారెక్టర్ అయినా ఉండాలి. అసలు భయమేంటో తెలియని మృగాలను.. భయపెట్టడానికి కొరటాల ఏం చేయబోతున్నాడనేదే.. ఇప్పుడు ఎగ్జైటింగ్‌గా మారింది. ఇక అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. మరి ఈ సినిమాతో కొరటాల సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.