ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారియర్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది. దాదాపు 900 మందితో భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ క్రిష్. దాంతో ఈ సినిమా షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. రీసెంట్గా పవన్ బైక్ రైడింగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా హరిహర వీరమల్లు సెట్స్‌లో ఉన్న పవన్ ఫొటో ఒకటి బయటకొచ్చింది. ఓ లేడీ ఫ్యాన్ షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్‌తో ఫోటో దిగింది. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో పవన్ ‘హరిహర వీరమల్లు’ లుక్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. గతంలో విడుదల చేసిన ‘హరి హర వీరమల్లు’ ఫస్ట్ గ్లింప్స్‌లో కనిపించిన గెటప్‌లోనే ఉన్నారు. వారియర్ లుక్‌లో.. చాలా పవర్‌ఫుల్‌గా రాయల్ లుక్‌లో.. యుద్ధానికి సై అన్నట్టుగా కనిపిస్తున్నారు పవన్. గుబురు గడ్డం.. నుదుటిపై గాయం.. రెడ్ షర్ట్, మెడలో రెడ్ స్కార్ఫ్‌తో ఉన్న ఈ రాబిన్ హుడ్ ఫొటో ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. ఇకపోతే.. హరిహర వీరమల్లు మూవీ పవన్ కెరీర్లో తెరకెక్కుతున్న ఫస్ట్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా పీరియాడికల్ ఫిల్మ్. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు.. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మరి అంచనాలు పెంచేస్తున్నహరిహర వీరమల్లు ఎలా ఉంటుందో చూడాలి.