పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పెద్ద పండుగ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఆ రోజు పవర్ స్టార్ సైన్యం చేసే సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. అయితే ఈసారి అంతకుమించి అనేలా రచ్చ చేశారు అభిమానుల. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజును పురస్కరించుకోని.. తమ్ముడు, జల్సా సినిమాలను రీ రిలీజ్ చేసి రికార్డులు క్రియేట్ చేశారు. ఇక పవన్‌కు విష్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేశారు. అభిమానులే కాదు సినీ సెలబ్రిటీస్ అంతా పవన్ పై ట్వీట్ల వర్షం కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మహారాజా రవితేజ.. లాంటి స్టార్ హీరోలంతా పవన్‌కు విష్ చేశారు. ఇందులో మహేష్ బాబు పెట్టిన బర్త్ డే పోస్ట్ వైరల్‌గా మారింది. దాంతో మహేష్, పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం.. పవన్‌కు విష్ చేయకపోవడం చర్చకు దారి తీసింది. అసలే మెగా వర్సెస్ అల్లు వార్ పీక్స్‌లో ఉంది. ఈ విషయంలో అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ తగ్గేదేలే అంటున్నారు.
ఇటీవలె ఓ నాలుగైదు రోజులు ఈ ఫ్యాన్ వార్.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ జరిగింది. అది కూడా దారుణంగా ట్రోల్ చేసుకుంటూ ట్రెండింగ్‌లో ఉన్నారు. అయితే దీనిపై మెగా కన్ను ఉందా.. ఉంటే ఫ్యాన్స్‌ను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారనేది అర్థం కాని విషయమే. ఈ నేపథ్యంలో మెగా వార్ నిజమేనని టాక్ ఊపందుకుంది. అయితే రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో అల్లు అరవింద్ దీనికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయినా బన్నీ.. పవన్‌కు ఎందుకు విష్ చేయలేనది హాట్ టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్ కావాలనే ఇలా చేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బన్నీనే టార్గెట్ చేస్తు విమర్శిస్తున్నారు. అయితే బన్నీ పర్సనల్‌గా పవన్‌కు విష్ చేసి ఉండొచ్చనేది మరో టాక్. ఏదేమైనా ఫ్యాన్స్ మాత్రం మెగా వర్సెస్ అల్లుగా రెచ్చిపోతున్నారు. మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.