ప్రస్తుత పరిస్థితుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా కంప్లీట్ చేయడమంటే.. మేకర్స్‌కు అంతకు మించిన టాస్క్ మరోటి ఉండదు. అయినా కూడా ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ దూసుకుపోతున్నాయి. తాజాగా పవన్ ఉస్తాద్‌కు డేట్స్ ఇచ్చాడట. అయినా కష్టమే అంటున్నారు.
Pawan: గబ్బర్ సింగ్ కాంబోని రిపీట్ చేస్తు పవన్ చేస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ ఈ సినిమా గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తూ వచ్చాడు. ఫైనల్‌గా షూటింగ్ స్టార్ట్ చేసిన కొన్ని కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు. రీసెంట్గా ఓ షెడ్యూల్ స్టార్ట్ చేయగా.. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో షూటింగ్ స్పాట్ నుంచే విజయవాడకు వెళ్లిపోయాడు. కానీ వెంటనే రెండు రోజులకు షూటింగ్లో మళ్లీ జాయిన్ అయ్యాడు. ఇక నెక్స్ట్ షెడ్యూల్‌ను కూడా రెడీ చేసుకొమని చెప్పాడట పవన్. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షెడ్యూల్ బ్రేక్‌లో ఉంది. కానీ సెప్టెంబర్ 26 నుంచి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చాడట. కానీ కష్టమేనని అంటున్నారు.
ప్రజెంట్ ఏపీలో పొలిటికల్ హీట్ ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో ఒక్కసారిగా టీడీపీతో పొత్తు అనౌన్స్ చేసి అగ్రెసివ్‌గా క్యాంపైన్స్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. దీంతో జనసేన కార్యకర్తలు, పవన్ డై హార్డ్ ఫ్యాన్స్ మంచి జోష్‌లో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఉస్తాద్ భగత్ సినిమా షూటింగ్‌కి మళ్లీ డేట్స్ కేటాయించాడని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్‌ని బట్టి, రాష్ట్ర రాజకీయ పరిస్థితులను బట్టి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌కి వస్తాడా? లేదా? అనేది ఆధారపడి ఉంటుందట. పొలిటికల్ హీట్ కాస్త తక్కువ ఉంటే.. సెప్టెంబర్ 26 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. లేదంటే.. పవన్ ఎప్పుడంటే అప్పుడే అంటున్నారు.