»Health Tips Eat Three Dates Each Day Know The Benefits
Useful Tips: రోజూ ఖర్జూరాలు తింటే కలిగే లాభాలు ఇవే..!
విటమిన్లు సి, బి1, బి2, బి3, బి5, ఎ, కె వంటి విటమిన్లు ఉండే మూడు ఖర్జూరాలను ప్రతిరోజూ మూడు పూటలా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.
Health Tips: Eat three dates each day, know the benefits
Useful Tips: ఖర్జూరం పోషకాలు అధికంగా ఉండే డ్రై ఫ్రూట్. ఖర్జూరంలో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్ వంటి విటమిన్లు , ఖనిజాలు ఉంటాయి. విటమిన్లు సి, బి1, బి2, బి3, బి5, ఎ, కె వంటి విటమిన్లు ఉండే మూడు ఖర్జూరాలను ప్రతిరోజూ మూడు పూటలా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.
ఫైబర్ పుష్కలంగా ఉండే ఖర్జూరాన్ని తినడం వల్ల జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఉదయం పూట మూడు ఖర్జూరాలు తింటే శరీరానికి త్వరగా శక్తి వస్తుంది. ఇది శరీరంలో ఐరన్ పరిమాణాన్ని పెంచడానికి ,రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. ఇవి కాల్షియం కలిగి ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. ఫైబర్ పుష్కలంగా మరియు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండే ఖర్జూరాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఖర్జూరంలో మెగ్నీషియం, పొటాషియం ఉండటం వల్ల కూడా రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఖర్జూరం చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.