Lemon Water : వీరు మాత్రం ఉదయాన్నే లెమన్ వాటర్ జోలికి అస్సలు వెళ్లకూడదు!
నిమ్మరసం పిండుకున్న నీటిని చాలా మంది పరగడుపున తాగుతుంటారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం వీటిని అస్సలు టచ్ చేయవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరెవరంటే....?
These People Should Not Drink Lemon Water : చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు పరగడుపున నిమ్మరసం వేసుకున్న నీటిని తాగుతూ ఉంటారు. సీ విటమిన్ లభిస్తుందని నిమ్మకాయను ఆహారాల్లోనూ ఎక్కువగా చేర్చుకుని వాడుతుంటారు. అందరికీ ఇది ఓకే గాని కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం ఈ లెమన్ వాటర్ని(Lemon Water) అస్సలు తాగొద్దంటున్నారు వైద్య నిపుణులు. మరి ఏఏ సమస్యలు ఉన్న వారు వీటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొంత మందికి కిడ్నీల్లో సమస్యలు ఉంటాయి. అలాంటి వారు పరగడుపున లెమన్ వాటర్(Lemon Water)ని అస్సలు తాగకూడదు. 2021లో యూరాలజీ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనంలో కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగే వారిలో రాళ్ల ఏర్పడే అవకాశాలున్నట్లు పరిశోధకులు తేల్చారు. అలాగే మధుమేహంతో ఇబ్బంది పడే వారు కూడా ఉదయాన్నే ఈ నీటిని తాగకూడదు. వీరు పరగడుపున(empty stomach) నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు ప్రభావితం అవుతాయి.
పొట్టలో పుండ్లు ఉన్న వారు, గ్యాస్ సంబంధిత సమస్యలు ఉన్న వారు సైతం పరగడుపున నిమ్మనీళ్లను(Lemon Water) తీసుకోకూడదు. ఈ నీరు పొట్టలో ఉండే పుండ్లకు తగిలి చికాకును కలిగిస్తుంది. ఫలితంగా నొప్పి కూడా రావచ్చు. అలాగే నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ జీర్ణ సమస్యలను తీవ్రతరం చేస్తుంది. అందుకనే ఎసిడిటీ సమస్యలు ఉన్న వారు తప్పకుండా ఖాళీ కడుపుతో(empty stomach) ఈ నీటిని తాగకూడదని గుర్తుంచుకోవాలి.