స్టార్ హీరోయిన్ నయనతారను జవాన్ డైరెక్టర్ అట్లీ హర్ట్ చేశాడా? అంటే, ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అట్లీ చేసిన పనికి కోపంగా ఉన్న నయన సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Jawan Shock: నయన తార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్, టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా దుమ్ములేపిన ఈ బ్యూటీ.. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుంది. అయినా కూడా వరుస సినిమాలు చేస్తోంది. సౌత్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా టాప్ ప్లేస్‌లో ఉంది. రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ నటించిన బాలీవుడ్ మూవీ జవాన్.. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే 900 కోట్లు క్రాస్ చేసిన జవాన్.. వెయ్యి కోట్ల వైపు దూసుకుపోతోంది.
అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. నార్త్ ఆడియెన్స్‌కు తెగ నచ్చేసింది. సౌత్‌లోను అదరొట్టింది. సౌత్‌తో జవాన్ సూపర్ హిట్ అవ్వడానికి కారణం అట్లీ, నయనతార, విజయ్ సేతుపతి అనే చెప్పాలి. బాలీవుడ్ మీడియాలో మాత్రం.. జవాన్ సినిమా విషయంలో నయనతార హర్ట్ అయినట్టుగా కథనాలు వస్తున్నాయి. జవాన్ సినిమాలో నయన తారకు సంబంధించిన సీన్స్ చాలా కట్ చేశారని, మరో హీరోయిన్గా నటించిన దీపికా పదుకొనే హైలైట్ అయ్యేలా చేశారని అంటున్నారు. ఈ విషయంలో నయనతార హార్ట్ అయ్యిందని బాలీవుడ్ మీడియా అంటోంది.
అట్లీపై కోపంగా ఉందని, ఇకపై బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉండాలని.. నయనతార నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. జవాన్ సక్సెస్‌ను నయనతార ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంది. కాబట్టి.. నయన తార అలిగిందని ఖచ్చితంగా చెప్పలేం అంటున్నారు.