ఇక హీరోయిన్గా పనైపోయింది.. అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది చైన్నై చిన్నది త్రిష. దాంతో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయింది అమ్మడు. పెళ్లికి రెడీ అవుతోందనే టాక్ నడుస్తోంది. దీంతో వార్నింగ్ ఇచ్చింది త్రిష.
Trisha: హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు దాటినా.. నాలుగు పదుల వయసుకు చేరవుతున్న త్రిష అందం ఏ మాత్రం చెక్కుచెదరలేదు.. రోజు రోజుకి మరింత అందంగా కనిపిస్తోంది. త్రిష ముందు ఏ కుర్ర హీరోయిన్ కూడా పనికి రాదనే రేంజ్లో ఉంది. ఈ మధ్య మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలతో త్రిషకు భారీ క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో తన గ్లామర్‌తో ఐశ్వర్య రాయ్‌ని సైతం డామినేట్ చేసేలా కనిపించింది. అందుకే అమ్మడికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
ప్రస్తుతం త్రిష కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘లియో’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇంకొన్ని తమిళ్, మళయాళ ప్రాజెక్ట్స్ చేస్తోంది. త్వరలో టాలీవుడ్ ఎంట్రీ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇలా ఓ పక్క త్రిష కెరీర్ పీక్స్‌లో ఉండగా మరో వైపు పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ వ్యాపారవేత్తతో త్రిష ఎంగేజ్మెంట్ అయింది.. ఆ తరువాత క్యాన్సిల్ అయింది. ఎందుకో ఏమో తెలియదు కానీ.. పెళ్లి వరకు వెళ్లిన త్రిష మళ్లీ పెళ్లి ఊసెత్తలేదు. కానీ ఇన్నాళ్లకు త్రిష పెళ్లి వార్తలు తమిళ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
త్రిష ఓ మలయాళ నిర్మాతను పెళ్లి చేసుకోబోతోందనే న్యూస్ వైరల్‌గా మారింది. గతంలో అతని నిర్మాణంలో వచ్చిన సినిమాల్లో త్రిష నటించిందని, ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని టాక్ నడుస్తోంది. అంతేకాదు.. ఈ ఏడాదే పెళ్లి అని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చింది త్రిష. తన ఇన్‌స్టా స్టోరీలో.. ‘ డియర్, మీరు మరియు మీ బృందం ఎవరో మాకు తెలుసు, ప్రశాంతంగా ఉండండి.. అలాగే పుకార్లు ఆపండి.. అని అంటూనే చీర్స్’ అని పేర్కొంది. దీంతో తనపై వస్తున్న పుకార్లను ఆపండని.. త్రిష వార్నింగ్ ఇచ్చిందని త్రిష అభిమానులు కామెంట్ చేస్తున్నారు.