Manchu Vishnu.. ఆ హీరోయిన్ను తప్పించాడా? తప్పుకుందా?
మంచు విష్ణు తాజాగా పోస్ట్ చేసిన్ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన లేటెస్ట్ ఫిల్మ్ 'భక్త కన్నప్ప' నుంచి హీరోయిన్ తప్పుకుందని.. ఈ విషయం చెప్పడానికి బాధగా ఉందని చెప్పుకొచ్చాడు. కానీ అసలు మ్యాటర్ వేరే ఉందంటున్నారు.
Manchu Vishnu: గత కొంత కాలంగా మంచు విష్ణు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని పాన్ ఇండియా స్థాయిలో ‘భక్త కన్నప్ప’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. మహేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనపించనున్నాడు. ప్రభాస్ క్యామియో చేస్తున్నాడు అని తెలియడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అప్పుడే ఈ సినిమా గురించి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు విష్ణు.
సినిమాలో కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి నుపూర్ సనన్ తప్పుకుందని అధికారికంగా ప్రకటించాడు. ‘ఈ బాధాకరమైన విషయాన్నీ మీకు చెప్పడం తనకు చాలా బాధగా అనిపిస్తుంది. షెడ్యూల్ బిజీ వల్ల కన్నప్ప నుంచి నుపూర్ సనన్ వైదొలగవలసి వచ్చింది. తాము ఆమెను ఎంతో మిస్ అవుతున్నాం. ప్రస్తుతం.. మరో కొత్త హీరోయిన్ కోసం వేట ప్రారంభమయ్యింది. వేరే కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న నుపూర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.. భవిష్యత్తులో ఆమెతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను’.. అని ట్వీట్ చేశాడు.
నుపూర్ తప్పుకోడానికి వేరే కారణం ఉందా? అనే టాక్ కూడా నడుస్తోంది. ఆమె ఎక్కడా కూడా రెస్పాన్స్ అవలేదు. మంచు విష్ణు స్వయంగా చెప్పినా కూడా.. తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తపుకున్నానని ప్రకటించలేదు. నుపుర్ సినిమా నుంచి తప్పుకోవడానికి వేరే కారణం కూడా ఉందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఫిల్మ్ నగర్ గుసగుసల ప్రకారం.. ఫిజికల్‌గా నుపుర్ ఈ ప్రాజెక్ట్‌లో సెట్ అవకపోవడం వల్లే.. మధ్యలో తప్పించారని భోగట్టా.