బిగ్‌బాస్7లో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. నామినేషన్స్‌లో అమర్, ప్రశాంత్, యావర్, శోభాశెట్టి, ప్రియాంకలు నిలిచారు. వాదోపవాదాల మధ్య గొడవల మధ్య ఈ నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది.
బాలీవుడ్ కండల వీరుడు అజయ్ దేవగన్ నటిస్తున్న తాజా చిత్రం “సింగం రిటర్న్స్”. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.
అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన లేటెస్ట్ ఫిల్మ్ అనిమల్. డిసెంబర్1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చిన అనిమల్.. భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగులో దుమ్ములేపుతోంది.
సలార్ వర్సెస్ డంకీ క్లాష్‌తో డిసెంబర్ 21, 22న పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవబోతోంది. ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య జరగబోయే ఈ వార్ ఇండియాలోనే బిగ్గెస్ట్ క్లాష్‌గా నిలవనుంది. ఇప్పటికే సలార్ ట్రైలర్ రిలీజ్ అవగా.. ఇప్పుడు డంకీ ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు.
మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'గుంటూరు కారం'. అతడు, ఖలేజా తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. దీనిపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ పై క్లారిటీ ఇచ్చాడు నిర్మాత నాగవంశీ.
ఇటీవల గోవాలో దక్షిణాది అవార్డుల వేడక జరిగింది. ఇందులో కన్నడ నటీనటులకు అవమానించేలా వ్యవహరించారని, నిర్వాహకులు అక్కడ సరైన ఏర్పాట్లు చేయలేదని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టగా దుమారం రేపింది. తెలుగు చిత్ర పరిశ్రమే వాళ్లను అవమానించిందని అన్నారు. దీనిపై నిర్మాత అల్లు అరవింద్ తాజాగా స్పందించారు.
అమిగోస్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయిన ఆషికా రంగనాథ్ ప్రస్తుతం నా సామిరంగ సినిమాలో నటిస్తోంది. అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. దీనికి సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
యానిమల్ మూవీలో విలన్‌గా చేసిన బాబీ డియోల్ ఎమోషనల్ అయ్యారు. మూవీకి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూసేందుకు థియేటర్‌కు వెళ్లారు. అక్కడ వారు బ్రహ్మారథం పట్టడంతో.. భావొద్వేగానికి గురయ్యారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ దేవర(devara)..ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. దేవర ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం భారీ సెట్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది.