మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'గుంటూరు కారం'. అతడు, ఖలేజా తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. దీనిపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ పై క్లారిటీ ఇచ్చాడు నిర్మాత నాగవంశీ.
Guntur Karam: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘గుంటూరు కారం’.. (Guntur Karam) ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మాస్ స్ట్రైక్, దమ్ మసాలా సాంగ్ దుమ్మలులేపేశాయి. ఇక ఇప్పుడు వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి.. ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. డిసెంబర్ ఎండింగ్లో గుంటూరు కారం షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. దీంతో సెకండ్ సింగిల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం నితిన్ నటిస్తున్న ఎక్స్ట్రా ఆర్డినరీమ్యాన్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మూవీ ప్రమోషన్లో భాగంగా.. ‘గుంటూరుకారం’ నిర్మాత నాగవంశీ ట్విటర్ ద్వారా.. సెకండ్ సాంగ్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు? అప్డేట్ ఎప్పుడు? ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.. అంటూ పోస్ట్ పెట్టాడు నితిన్. దానికి నిర్మాత నాగవంశీ స్పందిస్తూ ‘ఆ పనిలోనే ఉన్నాం నితిన్ స్వామి.. ఇంకో రెండు రోజుల్లో అద్భుతమైన వార్త చెబుతాం’ అంటూ రీ పోస్ట్ పెట్టారు. దీంతో రేపో మాపో గుంటూరు కారం నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ ఉండే ఛాన్స్ ఉంది.
ఈ సాంగ్ పక్కా మాస్‌గా అభిమానులకు ఫుల్ కిక్క్ ఇచ్చేలా ఉంటుందని సమాచారం. ఇక్కడి నుంచి ప్రమోషన్స్ మరింత స్పీడప్ కానుంది. మూవీని హారిక అండ్ హాసిని సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తుండగా.. యంగ్ బ్యూటీస్ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి గుంటూరు కారం ఎలా ఉంటుందో చూడాలి.