GDWL: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం తన సొంత ఖర్చులతో పాస్టర్లకు దుస్తులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.