TG: అంతర్రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకువచ్చి HYD, మంచిర్యాలలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 20 మంది ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సృష్టి ఫెర్టిలిటీ కేసు నిందితులు బెయిల్పై వచ్చి ఈ అక్రమాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో చిన్నారిని రూ.4-5 లక్షలకు అమ్ముతున్నట్లు తెలిసింది.