మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపోలో గత కొద్దికాలంగా పనిచేస్తున్న డిపో మేనేజర్ సుజాత బదిలీ అయ్యారు. ఆమె ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోకు బదిలీ అయ్యారు. మంగళవారం బస్సు భవన్ నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు వెల్లడించారు. సుజాత స్థానంలో బస్సు భవన్లో పనిచేస్తున్న అశోక్ కుమార్ పదోన్నతిపై MBNR డిపోకు మేనేజర్‌గా బదిలీపై రానున్నారు.