ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ దేవర(devara)..ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. దేవర ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం భారీ సెట్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) అసలు సిసలైన యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో.. దేవర సినిమాలో చూపించబోతున్నాడు కొరటాల శివ. కోస్టల్ ఏరియాలో దేవర చేసే మృగాల వేట మామూలుగా ఉండదని ఓపెనింగ్ రోజే చెప్పేశాడు కొరటాల. అందుకుతగ్గట్టే.. ఇప్పటికే హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో కొన్ని భారీ షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు కొరటాల. ఒక్కో షెడ్యూల్‌ను ఒక్కో యుద్ధంలా తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ మొదలుకొని క్లైమాక్స్ వరకు ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీన్స్ ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. నెక్స్ట్ షెడ్యూల్లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకోసం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్(huge set) వేస్తున్నారని తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లోని విజువల్స్ వండర్ ఫుల్‌గా ఉంటాయని సమాచారం. ముఖ్యంగా ఎన్టీఆర్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు.
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్(janhvi kapoor) హీరోయిన్గా నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ కలిసి దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆచార్య ఫ్లాప్‌తో ట్రోలింగ్ ఫేజ్ చేసిన కొరటాల..దేవరతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. వీలైనంత త్వరగా దేవర షూటింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ వార్2 షూటింగ్లో జాయిన్ అవడానికి రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్. మరి దేవరతో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.