టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకోగా.. వీటికి రికార్డు స్థాయిలో స్పందన లభించింది. విజయ్ పోస్ట్‌కు 13 మిలియన్లు, రష్మిక పోస్ట్‌కు 15 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. మొత్తంగా 28 మిలియన్లకు పైగా వ్యూస్‌తో సోషల్ మీడియాలో ఈ జంట సరికొత్త రికార్డు సృష్టించింది.
జాతకాలు, వాస్తును నమ్మే జూనియర్ లెక్చరర్ విష్ణు (శ్రీవిష్ణు).. రెండు పెళ్లిళ్ల దోషంతో అవమానాలు పడే మనీషా (నయన్ సారిక) మధ్య సాగే వినోదాత్మక చిత్రమిది. శ్రీవిష్ణు తన మార్క్ కామెడీ, టైమింగ్‌తో అదరగొట్టాడు. యువతను మెప్పించే మీమ్ కంటెంట్, ఆసక్తికరమైన ఇంటర్వెల్ సీన్లు మూవీకి ప్లస్. రొటీన్ కథ, ఊహించినట్లే సాగే స్క్రీన్ ప్లే మూవీకి మైనస్. రేటింగ్:2.5/5.
ఈటీవీ విన్ తన సరికొత్త ఓటీటీ కంటెంట్‌ను ‘విన్ జాతర’ పేరుతో ప్రకటించింది. ఈ ఏడాది ప్రేక్షకులను అలరించడానికి ఆసక్తికర చిత్రాలను సిద్ధం చేసింది. ఇందులో విరాజ్ అశ్విన్ నటించిన ‘గుర్తుకొస్తున్నాయి’, విభిన్న కథాంశంతో వస్తున్న ‘జిల్లేడు చెట్టు’, ఉత్కంఠభరితమైన ‘ది అన్‌టోల్డ్ టేల్ ఆఫ్ బ్లడ్-వై గోదావరి’ వంటి సినిమాలు ప్రధాన...
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబోలో ‘బ్లడీ రోమియో’ మూవీ తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పృథ్వీరాజ్ ‘వారణాసి’ మూవీతో బిజీగా ఉన్నాడు.
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌కు జోడీగా ‘మిరాయ్’ బ్యూటీ రితికా నాయక్ నటించనున్నట్లు తెలుస్తోంది. సందీప్ హీరోగా దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘పవర్ పేట’. ఇందులో కథానాయికగా రితిక నటించనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాను 70MM ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మిస్తుంది.
టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు ఒకటయ్యారు. ఫిబ్రవరి 26న వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంట పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సమంత, కరణ్ జోహార్, నాని, కాజల్ అగర్వాల్, కృతి సనన్ వంటి ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు తమ అభిమాన నటీనటులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడంతో పండగ చేసుకుంటున్నారు.
ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. మార్చి 4న హైదరాబాద్‌లో జరగనున్న తమ రిసెప్షన్ వేడుకకు రావాలని కోరుతూ వారు ప్రధానికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. FEB 26న రష్మిక, విజయ్ పెళ్లి జరగ్గా.. నెటిజన్లు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ 2026 మార్చి 26న విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ క్రేజ్, హోంబలే బ్రాండ్ తోడవడంతో అక్కడ రికార్డు వసూళ్లు రావడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఈటీవీ విన్’ రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కొత్త లోగో, కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది. తిరువీర్ హీరోగా నటిస్తున్న ‘పాపం ప్రతాప్’ మూవీని ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ ‘పాకశాల పంతం’ సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేస్తామంది.
రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్‌రావు: కనబడుటలేదు’. కృష్ణ పోలూరు దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ తాజాగా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం, ఉత్కంఠభరితమైన థ్రిల్లింగ్ అంశాలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.
శబరిమల అయ్యప్ప ఆలయ ధ్వజస్తంభం ఏర్పాటులో జరిగిన నిధుల గోల్‌మాల్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో నటులు మోహన్‌లాల్, దిలీప్ స్టేట్‌మెంట్‌లను కేరళ పోలీసులు రికార్డ్ చేశారు. 2017లో ధ్వజస్తంభం పునరుద్ధరణ సమయంలో జరిగిన అవకతవకలు, నిధుల వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరిగింది. దర్యాప్తులో భాగంగానే ఈ ప్రక్రియ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబో మూవీలో మృణాల్ ఠాకూర్ నటిస్తోందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల బన్నీకి ఫిల్మ్‌ఫేర్ అవార్డు రాగా, మృణాల్ శుభాకాంక్షలు తెలిపింది. దీనికి బన్నీ స్పందిస్తూ.. ‘త్వరలో నీతో కలిసి పని చేయాలని ఆశిస్తున్నా’ అంటూ కన్నుకొట్టే ఎమోజీతో హింట్ ఇచ్చాడు. అట్లీ మూవీ కాకపోయినా, వీరిద్దరి కాంబో సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
హీరో అల్లు శిరీష్ వివాహ వేడుకలు మొదలయ్యాయి. మార్చి 6న నయనికతో ఆయన ఏడు అడుగులు వేయనున్నాడు. ఈ క్రమంలో మార్చి 2న అల్లు స్టూడియోస్‌లో అత్యంత గ్రాండ్‌గా ‘ప్రీ వెడ్డింగ్’ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు హాజరుకానున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనున్న ఈ వేడుక ఏర్పాట్లను శిరీష్ స్వయంగా వెల్లడించాడు.
నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘స్వయంభు’. విజువల్ గ్రాండియర్‌గా రూపొందుతున్న ఈ మూవీపై తాజాగా క్రేజీ అప్‌డేట్ వచ్చింది. కథా దృష్ట్యా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు నిఖిల్ స్వయంగా ప్రకటించాడు. 2026 ఏప్రిల్ 10న తొలి భాగాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ వార్తతో ఫ్యాన్స్‌లో అంచనాలు రెట్టింపయ్యాయి.