Anup Rubens: ఓ మంచి ఘోస్ట్.. పైసారే పైసా అంటున్న అనూప్ రూబెన్స్!
టాలీవుడ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనూప్ రూబెన్స్ కూడా ఒకడు. గతంలో చాలామంది స్టార్ హీరోలకు అదిరిపోయే ఆల్బమ్స్ ఇచ్చాడు అనూప్. ఇష్క్, మనం లాంటి సినిమాల పాటలు ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి. అయితే ఈ మధ్య అనూప్ సందడి కాస్త తగ్గింది. ప్రస్తుతం తమన్, దేవిశ్రీ హవా నడుస్తోంది. అయినా మీడియం రేంజ్ సినిమాలకు సూపర్ మ్యూజిక్ ఇస్తున్నాడు అనూప్. ఇప్పుడు పైసారే పైసా అనే పాటతో మల్టీటాలెంట్‌ను చూపించాడు.
టాలీవుడ్(Tollywood) నుంచి ఓఎంజీ(OMG).. ఓ మంచి ఘోస్ట్ అనే క్యాప్షన్‌తో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాకే అనూప్ రూబెన్స్(Anup Rubens) సంగీతాన్ని అందిస్తున్నాడు. అంతేకాదు.. ఆయనే సమర్పిస్తున్నాడు. అనుప్ రుబెన్స్ సమర్పణలో మార్క్ సెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద డాక్టర్ అబినికా ఐనభాతుని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వెన్నెల కిశోర్, శకలక శంకర్, కమెడియన్ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
హర్రర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి.. ఇప్పటికే ఫస్ట్ లుక్‌ని రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) చేతుల మీదుగా రిలీజ్ చేయగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు పైసా రే పైసా అంటూ సాగే ప్రోమో సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రూబెన్సే(Anup Rubens) స్వయంగా రచించి, పాడటం విశేషం. ఈ సాంగ్‌లో మనిషి నిజజీవితంలో డబ్బు విలువను, డబ్బు అవసరాన్ని గురించి చాలా బాగా రాశారు.
ఈ ప్రోమో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో.. ఫుల్ సాంగ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ ఫుల్ సాంగ్ విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే.. ‘పైసా రే పైసా’ ప్రోమో సాంగ్ వైరల్ అవుతోంది. ఇక ‘ఓ మంచి ఘోస్ట్’ అనే ట్యాగ్ లైన్ చాలా క్యాచీగా ఉండటంతో.. ఈ సినిమా ఇంట్రెస్టింగ్గా మారింది. మరి ఈ సినిమాతో అనూప్ రూబెన్స్ (Anup Rubens) ఎలాంటి ఆల్బమ్ ఇస్తాడో చూడాలి.