Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన కొత్త సినిమాతో ధమ్కీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అది కూడా పాన్ ఇండియా లెవల్లో కావడంతో.. ధమ్కీ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోను ఉంది. వాస్తవానికైతే ఈపాటికే ధమ్కీ థియేటర్లోకి రావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వల్ల పోస్ట్ పోన్ అయింది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన కొత్త సినిమాతో ధమ్కీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అది కూడా పాన్ ఇండియా లెవల్లో కావడంతో.. ధమ్కీ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోను ఉంది. వాస్తవానికైతే ఈపాటికే ధమ్కీ థియేటర్లోకి రావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వల్ల పోస్ట్ పోన్ అయింది. అయితే ఈసారి మాత్రం ధమ్కీ ఇవ్వడం పక్కా అంటున్నాడు. విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించిన ‘దాస్ కా ధమ్కీ’ మూవీని మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌తో డబుల్ డోస్‌కు రెడీ అవండని.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తోందని చెప్పుకొచ్చాడు విశ్వక్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ చేసిన మూడు పాట చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. హాట్ బ్యూటీ నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్‌గా ఎన్టీఆర్ రాబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆస్కార్ కోసం అమెరికాలో ఉన్నాడు. ఆస్కార్ వేడుకలు అయిపోగానే.. ఇండియాకి తిరిగి రానున్నాడు. వచ్చి రాగానే ధమ్కీ ఈవెంట్లో సందడి చేయబోతున్నాడు. మార్చి 17న ఈ ఈవెంట్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ గెస్ట్ అంటున్నారు కాబట్టి.. ధమ్కీకి ఆటోమేటిక్‌గా పాన్ ఇండియా క్రేజ్ రానుందని చెప్పొచ్చు.