‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘ఎన్టీఆర్-కొరటాల’ శివ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే యంగ్ టైగర్ కోసం కొరటాల పవర్ ఫుల్ స్టోరీ రాసినట్టు తెలుస్తోంది. అందుకే సెట్స్ పైకి వెళ్లడానికి ఇంత సమయం తీసుకున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని..
అతి త్వరలో షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ లొకేషన్ వేటలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య గోవాకు కూడా వెళ్లినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో.. ఎన్టీఆర్ 30 గురించి ఓ సాలిడ్ అప్టేట్ వినిపిస్తోంది. గతంలో తారక్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన.. ‘ఫ్యూరీ ఆఫ్ ఎన్టీఆర్ 30’ మోషన్ పోస్టర్లో పవర్ ఫుల్ డైలాగ్‌తో పాటు..
సముద్రంలో ఎగిసి పడుతున్న కెరటాలు, పడవల మధ్యలో.. ఊచకోతే అన్నట్టుగా ఉన్న తారక్ బ్యాక్ సైడ్ లుక్ రివీల్ చేసారు. దాంతో ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కబోతున్నట్టు వార్తలొచ్చాయి. అందుకు తగ్గట్టే ఇప్పుడు.. వాటర్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అలాంటి లొకేషన్ కోసమే వెతుకుతోందట చిత్ర యూనిట్.
ఇదే నిజమైతే తారక్ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పొచ్చు. ఇకపోతే.. ఆర్ఆర్ఆర్ తర్వాత భారీ పాన్ ఇండియా చిత్రంగా రాబోతోంది ఎన్టీఆర్ 30. ఈ సినిమాకు కోలీవుడ్ యంగ్ టాలెంట్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే హీరోయిన్ విషయంలోనే సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుందని అంటున్నారు.